
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి బాగా కోలుకున్నా రోజంతా వోలటైల్‌గా కొనసాగింది. చివరికి మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 10 పాయింట్లు మేర లాభపడగా, నిఫ్టీ 2 పాయింట్ల నష్టాలకు పరిమితమై 11555 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంకులు భారీగాకోలుకోవడంతో మార్కెట్ నష్టాలనుంచి తెప్పరిల్లింది.
ఫార్మ, ప్రభుత్వ రంగ బ్యాంకు, రియల్, ఇన్‌ఫ్రా సెక్టార్లలోకొనుగోళ్ల ఆసక్తి నెలకొంది. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు నష్టపోయాయి. బజాన్ ఫిన్, హీరోమోటోకార్ప్, రిలయన్స్ అదానీ పవర్, సన్ ఫార్మ , భారతి ఎయిర్‌టెల్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. గెయిల్, టైటన్, యూపీఎల్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, ఐటీసీ, మారుతి నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment