సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ సూచీలు సరికొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలో స్వల్పంగా నష్టపోయిన సూచీలు ఆ వెంటనే లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 350పాయింట్లు జంప్ చేయగా, నిఫ్టీ ఆల్ టైం హైని తాకింది. సెన్సెక్స్ 62,687 వద్ద నిఫ్టీ 18,611 వద్ద తాజా రికార్డును తాకింది. మెటల్ తప్ప దాదాపు అన్ని రంగాలు లాభాలనార్జించాయి. రిలయన్స్, ఏసియన్ పెయింట్స్ భారీగా లాభపడ్డాయి. చివరికి సెన్సెక్స్ 212 పాయింట్లు ఎగిసి 62,505 నిఫ్టీ 50 పాయింట్లు లాభంతో 18563 వద్ద ముగిసాయి.
చైనాలో కరోనా మళ్లీ విస్తరించడం, లాక్‌డౌన్ ఆంక్షలు, జీరో-కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రదర్శనల ఫలితంగా గ్లోబల్ మార్కెట్లు బలహీనపడ్డాయి. దీనికి తోడు ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో చమురు మార్కెటింగ్ కంపెనీల లాభాలతో సెన్సెక్స్ నిఫ్టీ కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. బ్యాంకు నిఫ్టీ కూడా 43వేల ఎగువకు చేరింది.
బీపీసీఎల్, ఎస్‌బీఐ లైఫ్, హీరో మోటో, రిలయన్స్, టాటా మోటార్స్, టాటా కన్జ్యూమర్స్, నెస్లే టాప్ విన్నర్స్‌గా, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, హెచ్‌డీఎఫ్‌సీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,టాటాస్టీల్, గ్రాసిం టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాల్లో 81.64 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment