
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సాధారణ వర్షపాత అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉంది. ఆరంభ లాభాల జోరును దూకుడు గా కొనసాగిస్తోంది. త్రిబుల్ సెంచరీ లాభాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్లు లాభంతో 39212 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు ఎగిసి 11772 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో నిఫ్టీ మరో సరికొత్త హైని టచ్ చేసింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ఉన్నాయి. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ బాగా లాభపడుతోంది. 30300 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది.
మారుతి, హీరో మోటో, ఐసీఐసీఐ, వేదాంతా, భారతి ఇన్‌ఫ్రాటెల్, జీ, ఇండస్ ఇండ్, విప్రో లాభపడుతున్నాయి. మరోవైపు యిర్‌టెల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, అదానీ, జెట్ ఎయిర్ వేస్ నష్టపోతున్నాయి.
అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ప్రారంభమైంది. 69.49 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది.
Comments
Please login to add a commentAdd a comment