
సాక్షి, ముంబై : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు చల్లబడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది. ఈనేపథ్యంలో దేశీయంగా స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్ 257 పాయింట్లు ఎగిసి 41857 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు లాభంతో 12330 వద్ద కొత్త కొనసాగుతుతోంది. తద్వారా కీలకసూచీ సెన్సెక్స్ 41880 వద్ద ఆల్ టైం హైని టచ్ చేసింది. అలాగే నిఫ్టీ 12330కి ఎగువన స్థిరంగా ఉంది. దాదాపు అన్ని సెక్టార్లు కొనుగోళ్లతో కళ కళ లాడుతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ సెక్టార్ల లాభాలు మార్కెట్‌కుమద్దతునిస్తున్నాయి.
ముఖ‍్యంగా ఆశాజనక ఫలితాలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టాప్ విన్నర్‌గా కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, సన్ ఫార్మ, ఇండస్‌ఇండ్ బ్యాంకు, ఎస్‌బీఐ, టాటా స్టీల్, కోటక మహీంద్ర, ఐసీఐసీ, ఐటీ భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. మరోవైపు యస్‌బ్యాంకు, టాటా మోటార్స్, భారతి ఇన్‌ఫ్రాటెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐషర్‌మోటార్స్, టీసీఎస్ నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment