
ముంబై : గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్‌తో స్టాక్ మార్కెట్లు సత్తా చాటాయి. పలు రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,000 పాయింట్ల ఎగువన సరికొత్త శిఖరాలకు చేరింది. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సి, ఇన్ఫోసిస్, యస్ బ్యాంక్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కో షేర్లు లాభపడుతుండగా..జీ ఎంటర్‌టైన్‌మెంట్, భారతి ఇన్‌ఫ్రాటెల్, భారతి ఎయిర్‌టెల్‌లు నష్టపోతున్నాయి.
ఇక 176 పాయింట్ల లాభంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 41,066 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 38 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 12,111 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.మరోవైపు జీడీపీ వృద్ధిపై మంగళవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక గణాంకాలు మార్కెట్ తదుపరి గమనాన్ని నిర్ధేశిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment