సెన్సెక్స్ సరికొత్త రికార్డు
సెన్సెక్స్ సరికొత్త రికార్డు
Published Thu, Jan 23 2014 4:48 PM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ సెన్సెక్స్ సరికొత్త గరిష్టస్థాయిని నమోదు చేసుకుంది. గురువారం నాటి మార్కెట్ లో 36 పాయింట్ల వృద్ధితో 21373 పాయింట్ల వద్ద ముగిసింది.
గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 274 పాయింట్లు లాభపడింది. అయితే డిసెంబర్ 9 తేదిన నమోదు చేసిన ఇంట్రాడే హై 21483 పాయింట్లను అధిగమించలేదు. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 6345 వద్ద ముగిసింది.
లార్సన్, యాక్సీస్ బ్యాంక్, గెయిల్, జిందాల్ స్టీల్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, హెచ్ సీఎల్ టెక్, ఓఎన్ జీసీ, పీఎన్ బీ, ఎన్ టీపీసీ నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.
Advertisement
Advertisement