
సాక్షి,ముంబై: ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడుమీద ఉన్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో మార్కెట్లు మరోసారి రికార్డుల మైలురాళ్లను చేరుకున్నాయి. సెన్సెక్స్ 40,000, నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌లను సులభంగా అధిగమించి స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ అరంభ లాభాల నుంచి మరింత ఎగిసి 422పాయింట్లు జంప్‌చేసి 40,136 వద్ద నిఫ్టీ సైతం 125 పాయింట్లు ఎగసి 12,048 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనల కారణంగా యూరప్, అమెరికా, ఆసియా మార్కెట్లు నీరసించినప్పటికీ దేశీయంగా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఒక్క మీడియా మినహా మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్, ఆటో, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్స్ లాభాలు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో హీరో మోటో, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, ఐవోసీ, టాటా స్టీల్, ఐబీ హౌసింగ్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, యస్ బ్యాంక్ టాప్ విన్నర్స్‌గా కొనసాగుతున్నాయి. ఓఎన్‌జీసీ, ఐటీసీ, ఐషర్, టెక్ మహీంద్రా, గెయిల్, ఎల్‌అండ్‌టీ స్వల్పంగా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment