ఏపీలో ఆల్‌టైం హై విద్యుత్‌ వినియోగం! | AP Power Usage Hit All Time High Record May 31 2024 | Sakshi
Sakshi News home page

ఏపీలో కాలుతున్న కరెంట్‌.. ఇవాళ ఆల్‌టైం హై రికార్డు వినియోగం

Published Fri, May 31 2024 4:14 PM | Last Updated on Fri, May 31 2024 6:05 PM

AP Power Usage Hit All Time High Record May 31 2024

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ వినియోగం ఆల్‌టైం హై రికార్డును తాకింది.  ఎండల తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలోనే వినియోగం పెరిగిందని విద్యుత్‌ శాఖ అధికారులు అంచనాకి వచ్చారు.  గడిచిన మూడు రోజుల్లో కరెంట్‌ను ప్రజలు విపరీతంగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు. 

ఏపీ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో బుధవారం  253 మిలియన్ యూనిట్లు, గురువారం 259 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ రోజు రికార్డుస్ధాయిలో 260  మిలియన్ యానిట్ల దాటే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే గత ఏడాది ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ 219 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉండడం గమనార్హం. 

ఇక గత ఎనిమిదేళ్లలో మే నెలలో రికార్డు స్ధాయి విద్యుత్‌ వినియోగం ఇదే కావడం మరో విశేషం. ఎన్నడూ లేని విధంగా 13231 మెగావాట్లకి పైగా  విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. గత ఏడాది కంటే 26 శాతం అధికంగా విద్యుత్ డిమాండ్ నెలకొనడం ఇంకో విశేషం. 

ఏపీ సర్కార్‌ ముందు జాగ్రత్త
గడిచిన మూడు రోజులుగా ఏపీలో కరెంట్‌ కాలుతోంది. మరో మూడు, నాలుగు రోజుల పాటు ఇదే  పరిస్థితి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. డిమాండ్‌ పీక్‌లో ఉన్న టైంలోనూ కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా కొనసాగుతోందని అధికారులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక కారణంగా యూనిట్‌ విద్యుత్‌ రూ.7లకే కొనుగోలు చేస్తోంది. మొత్తం రూ.15 కోట్లతో 22 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తోంది ఏపీ విద్యుత్ శాఖ.

ఏపీలో ఆల్ టైం హై విద్యుత్ వినియోగం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement