
సాక్షి, న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు సామాన్యుడికి అందని స్ధాయిలో దూసుకుపోతున్నాయి. రెండు వారాలుగా పైపైకి ఎగబాకిన పసిడి దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఆల్‌టైం హైకి చేరాయి. పదిగ్రాముల పసిడి ఏకంగా 57,008 రూపాయలకు పెరిగింది. మరోవైపు వెండి ధర కిలోకు 576 రూపాయలు భారమై 77,840 రూపాయలు పలికింది. పసిడి ధరలు స్వల్పంగా పెరిగినా గత 16 సెషన్స్‌లో వరుసగా పెరగడంతో తాజాగా సరికొత్త శిఖరాలకు ఎగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం త్వరలోనే రికార్డుస్ధాయిలో 2080 డాలర్ల వరకూ పెరుగుతుందని నేషనల్ ఆస్ర్టేలియా బ్యాంక్ ఆర్థిక వేత్త జాన్ శర్మ అంచనా వేశారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరగడం, ఆర్థిక అనిశ్చితితో మదుపుదారులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో బులియన్ మార్కెట్‌లో ఈవారం బంగారం పదేళ్ల గరిష్టస్ధాయిలో భారీగా లాభపడిందని రాయ్‌టర్స్ పేర్కొంది. కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో బంగారంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతారని, రాబోయే రోజుల్లోనే బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment