
ముంబై : బంగారం, వెండి ధరలు గురువారం ఆల్ టైం హైకి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ యల్లోమెటల్ ధర ఎగిసింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి 765 రూపాయలు భారమై తొలిసారిగా 55,863 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి ఏకంగా 4074 రూపాయలు పెరిగి 75,967 రూపాయలకు ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరగడం ఆర్థిక వ్యవస్థ రికవరీపై పెనుప్రభావం చూపుతుందనే అంచనాలతో మదుపుదారులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఏకంగా 2055 డాలర్ల ఆల్‌టైం హైకి చేరింది. అమెరికన్ డాలర్ బలహీనపడటం, మదుపుదారుల పెట్టుబడులు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా కేసులు పెరుగుతుండటం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని కొటక్ సెక్యూరిటీస్ కమాడిటీ రీసెర్చ్ హెడ్ రవీంద్ర రావు అంచనా వేశారు. అమెరికన్ డాలర్ పుంజుకుంటే బంగారం ధరల్లో కొంత తగ్గుదల నమోదవుతుందని ఆయన పేర్కొన్నారు. చదవండి : పసిడి ఎఫెక్ట్ : 1500 కోట్ల ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment