Petrol Diesel Prices దేశ చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక సంక్షోభం నుండి మరొక సంక్షోభం లోకి కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో అక్కడ ఇంధన ధరలు రూ. 300 మార్కును దాటాయి. దీంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశ ప్రజలు మరింత సంక్షోభంలోకి కూరుకు పోనున్నారని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంధన ధరలను పెంచేసింది. పెట్రోల్ ధరను 14.91, హై-స్పీడ్ డీజిల్ (HSD) ధరను 18.44 పెంచినట్లు గురువారం సాయంత్రం ప్రకటించింది. దీంతో అక్కడ ప్రస్తుతం పెట్రోల్ ధర305.36 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ.311.84కి చేరుకుంది. ఇటీవలి ఆర్థిక సంస్కరణలతో పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం ఆల్ టైం హైకి చేరింది. ఫలితంగా పాకిస్థానీ రూపాయి కూడా దిగ జారి పోతుండటంతో సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను కూడా భారీగా పెంచేసింది. డాలరు మారకంలో పాక్ కరెన్సీ 305.6 వద్దకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment