ఇస్లామాబాద్: పెచ్చరిల్లిన హింస, పెట్రేగిన ఉగ్రదాడులు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధానిఇమ్రాన్‌ఖాన్ ఊచలు లెక్కపెడుతున్న వేళ ఆరేళ్ల ప్రవాసం నుంచి తిరిగొచ్చిన మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యం దన్నుతో అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే 74 ఏళ్ల షరీఫ్ రికార్డుస్థాయిలో నాలుగోసారి పాక్ ప్రధాని అవుతారు.
నవాజ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ పారీ్ట అత్యధిక సీట్లు సాధించేలా కన్పిస్తోంది. ఇమ్రాన్ పార్టీ పీటీఐ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్‌పై ఈసీ నిషేధం విధించింది. దాంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలో దిగారు. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) సైతం ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 12.85 కోట్ల ఓటర్లు ఈసారి ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోనున్నారు.
బుధవారమే బలూచిస్తాన్ ప్రావిన్స్‌న్స్‌లో ఉగ్రవాదులు జంట బాంబుదాడులతో పదుల సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకున్న నేపథ్యంలో 6.5 లక్షల మంది భద్రతా సిబ్బందితో పోలింగ్‌స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు. నేషనల్ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికల్లో ఈసారి 5,121 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 336 సీట్లకుగాను 266 సీట్లకు బుధవారం పోలింగ్ జరగనుంది. మరో 60 సీట్లు మహిళలకు రిజర్వ్‌చేశారు. మరో 10 సీట్లు మైనారిటీలకు రిజర్వ్‌చేశారు. ఇంకొన్ని సీట్లు పార్టీలు గెలిచిన సీట్లను బట్టి దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ గురువారమే ఎన్నికలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment