సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరోరోజూ భారమయ్యాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరగడం, అధిక డిమాండ్ కారణంగా పెట్రో ధరలు మండుతున్నాయి. మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ సగటున రూ 80కి చేరువవుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు డీజిల్ ధరలు సైతం రూ 67కు ఎగబాకాయి. ఈ ఏడాది జనవరి 24న పెట్రోల్ ధరలు మూడేళ్ల గరిష్టస్ధాయిని తాకినప్పటి నుంచీ ధరల షాక్ కొనసాగుతూనే ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, ఒపెక్ దేశాల్లో చమురు ఉత్పత్తులపై నియంత్రణలతో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఇక రూపాయి మారకం, పెట్రో ఉత్పత్తులపై సుంకాలతో దేశీయ వినియోగదారులు పెట్రో ధరలపై ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. పెట్రో ఉత్పత్తులపై పన్ను భారం తగ్గించాలని కేంద్రాన్ని కోరుతుంటే రాష్ట్రాలు పెట్రోల్‌పై వ్యాట్, ఇతర పన్నులను తగ్గించాలని కేంద్రం కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment