
వరుసగా ఆరో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు ఆ తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా సెన్సెక్స ఒక దశలో 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అయింది. అటు నిఫ్టీ కూడా 11500 దిగువకు చేరింది. అనంతరం సెన్సెక్స్ 18పాయింట్ల నష్టంతో 38006 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లు లాభంతో 11430 వద్దకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్ 45 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నా ఊగిసలాట ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.
తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో ట్రిపుల్ సెంచరీ లాభాలతో దూసుకుపోయింది. రియల్టీ అత్యధికంగా 2.7 శాతం పుంజుకోగా, ప్రయివేట్ బ్యాంక్స్ 0.5 శాతం బలపడ్డాయి. మరోవైపు ఆటో 1.2 శాతం, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్ 0.5 శాతం చొప్పున క్షీణించాయి.
రియల్టీ షేర్లలో ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 16 శాతంపైగా దూసుకెళ్లగా.. బ్రిగేడ్, ఇండియాబుల్స్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, శోభా, సన్‌టెక్, మహీంద్రా లైఫ్ 6-1 శాతం మధ్య ఎగశాయి. వీటితోపాటు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, టాటా మోటార్స్, ఇన్ఫ్రాటెల్, యాక్సిస్, టాటా స్టీల్, ఆర్‌ఐఎల్, కొటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ లాభపడుతుండగా, మారుతీ, హీరో మోటో, గ్రాసిమ్, ఐషర్, వేదాంతా, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్ టెక్, విప్రో నష్టపోతున్నాయి.
మరోవైపు ఎన్నికలు ముగిసేనాటికి సెన్సెక్స్ 40వేల స్థాయిని తాకుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 2019 లో 40వేలను టచ్ చేస్తుదని బీఎన్‌పీ పరిబాస్ చెప్తుండగా, డిసెంబరు 2019 నాటికి 42 వేల టార్గెట్‌ను మోర్గాన్ స్టాన్లీ నిర్ణయించింది. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ ఉన్నప్పటికీ, సాంకేతిక మద్దతుస్థాయిల వద్ద స్థిరంగా ఉంటున్న సెన్సెక్స్ 2019లో ఆల్‌టైం గరిష్టాన్ని టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 2030 నాటికి 50వేలను దాటొవచ్చని చెప్పారు. అంతేకాదు లక్ష స్థాయిని కూడా తాకే అవకాశం ఉందని ఎలిక్సిర్ ఈక్విటీ డైరెక్టర్ దిపన్ మెహతా వ్యాఖ్యానించారు. అలాగే రానున్న మూడేళ్లలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు 15శాతం లాభాలొస్తాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment