న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఇండియాలో ఐఫోన్ అమ్మకాల్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఐఫోన్ అమ్మకాలలో అత్యధిక ఆదాయాన్నినమోదు చేసింది. భారతదేశంలో బలమైన రెండంకెల వృద్ధితో ఆల్-టైమ్ రికార్డు ఆదాయ రికార్డును సాధించింది ఈ ఏడాది నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాల సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ వివరాలను వెల్లడించారు. ఒక్క సెప్టెంబర్ త్రైమాసికంలోనే ఐఫోన్ విక్రయాల్లో 10శాతం వృద్ధిని సాధించి 42.6 బిలియన్ల డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.
ఈ త్రైమాసికంలో ప్రపంచంలోని ప్రతి మార్కెట్లోనూ తమకు అద్భుతమైన ఆదాయం లభించిందని కుక్ తెలిపారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ, లాటిన్ అమెరికా దేశాల్లోనూ ఇదే తరహాలో వృద్ధి నమోదు చేశామన్నారు. ముఖ్యంగా థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా, మెక్సికో దేశాల్లో రెట్టింపు ఆదాయం సాధించామనీ, అలాగే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మరింత విజయవంతంగా అమ్మకాలు సాగిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్‌లో డీల్స్, ఆఫర్‌ల కారణంగా ఐఫోన్ అమ్మకాలు జోరందుకున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment