iPhone sales
-
భారత్‌లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్‌లోకి యాపిల్
భారతదేశంలో ఐఫోన్ అమ్మకాలను ప్రారంభించిన తరువాత మొదటిసారి యాపిల్ వాల్యూమ్ పరంగా టాప్ 5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లిస్ట్‌లోకి చేరింది. 2024 అక్టోబర్-డిసెంబర్ కాలంలో 10% మార్కెట్ వాటాను సాధించింది. దేశంలో యాపిల్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు ఈ విజయం నిదర్శనమని కంపెనీ తెలిపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో యాపిల్ మార్కెట్ వాటా 8.6 శాతంగా ఉంది. ఆ సమయంలో ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 58.5% పెరిగాయి.యాపిల్ విజయానికి ప్రధాన కారణాలుమార్కెట్ వాటా వృద్ధి: 2024 పండుగ సీజన్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ 9-10% మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ట్రేడ్-ఇన్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్లు, 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించింది. దాంతో మార్కెట్ వాటా పెరిగింది.పాపులర్ మోడల్స్: ఐఫోన్ 15, ఐఫోన్ 13 వంటి పాత మోడళ్ల కొనుగోలుకు వినియోగదారులు ఎంతో ఆసక్తి చూపించారు. ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ 16 సిరీస్ కూడా కంపెనీ విక్రయాలు పెరిగేందుకు దోహదం చేశాయి.స్థానికంగా తయారీ: దేశీయ తయారీపై యాపిల్ దృష్టి సారించింది. కంపెనీ విక్రయాలు గణనీయంగా పెరిగేందుకు ఇది కూడా తోడైంది. ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, టాటా టెక్నాలజీస్ వంటి భాగస్వాముల ద్వారా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను భారత్‌లో తయారు చేస్తోంది. దేశీయంగా ఖర్చులు తగ్గించుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. దాంతోపాటు భారతీయ వినియోగదారుల్లో సానుకూల బ్రాండ్ ఇమేజ్ను సృష్టిస్తుందని కంపెనీ నమ్ముతుంది.ఆర్థిక కారకాలు: మధ్యతరగతి, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆర్థిక స్వేచ్ఛ వల్ల ప్రీమియం మోడళ్ల కొనుగోళ్లు అధికమవుతున్నాయి. యాపిల్ బ్రాండ్‌కు ఉన్న విలువ వల్ల ఎక్కువ మంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాలు డీలా.. కంపెనీ షేర్ల నేలచూపులుభవిష్యత్తు అవకాశాలు2026 నాటికి యాపిల్ మూడో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించనుందని, వార్షిక ఐఫోన్ అమ్మకాలు 15 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని అంచనా. దేశీయ తయారీ, సమర్థవంతమైన పంపిణీ, ప్రీమియం ఆఫర్లపై కంపెనీ దృష్టి సారిస్తుండడం వంటి అంశాలు భారత మార్కెట్లో వృద్ధికి దోహదపడుతుంది. -
అంతా ఐఫోన్ల చలవే! టిమ్‌కుక్ ఫుల్ హ్యాపీ
ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలు తయారు చేసే ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్.. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. ఆ కంపెనీ తయారు చేసిన ఐఫోన్లు భారీగా అమ్ముడుపోవడంతో అత్యధిక లాభాలు వచ్చాయి. యాపిల్ కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో 119.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9.9 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 2 శాతం అధికం. ఈ త్రైమాసికంలో ఐఫోన్లు 6 శాతం అధికంగా అమ్ముడుపోయాయి. మొత్తం ఆదాయంలో ఐఫోన్ల ద్వారా వచ్చిన ఆదాయం 69.7 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.5.7 లక్షల కోట్లు). యాపిల్ యాక్టివ్ డివైజ్ బేస్ ఆల్‌టైమ్ హైని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులను వాడుతున్నవారి సంఖ్య 220 కోట్లను దాటింది. భారత్‌లో ఆదాయ పరంగా వృద్ధిని సాధించామని, డిసెంబర్ త్రైమాసికంలో బలమైన రెండంకెల వృద్ధిని, ఆదాయ రికార్డును తాకినట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. భారత్‌తో పాటు మలేషియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలాండ్, టర్కీ, ఇండోనేషియా, సౌదీ అరేబియా వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో యాపిల్ రికార్డు ఆదాయాలను నమోదు చేసింది. 2023లో ఆదాయ పరంగా యాపిల్ భారతీయ మార్కెట్లో అగ్రగామిగా ఉందని, ఎగుమతులలో కోటి యూనిట్లను అధిగమించిందని ‘కౌంటర్‌పాయింట్ రీసెర్చ్’ పేర్కొంది. -
ఆపిల్ ఐఫోన్లు, మనోళ్లు తెగ కొనేశారట: రికార్డు ఆదాయం
న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఇండియాలో ఐఫోన్ అమ్మకాల్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఐఫోన్ అమ్మకాలలో అత్యధిక ఆదాయాన్నినమోదు చేసింది. భారతదేశంలో బలమైన రెండంకెల వృద్ధితో ఆల్-టైమ్ రికార్డు ఆదాయ రికార్డును సాధించింది ఈ ఏడాది నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాల సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ వివరాలను వెల్లడించారు. ఒక్క సెప్టెంబర్ త్రైమాసికంలోనే ఐఫోన్ విక్రయాల్లో 10శాతం వృద్ధిని సాధించి 42.6 బిలియన్ల డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో ప్రపంచంలోని ప్రతి మార్కెట్లోనూ తమకు అద్భుతమైన ఆదాయం లభించిందని కుక్ తెలిపారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ, లాటిన్ అమెరికా దేశాల్లోనూ ఇదే తరహాలో వృద్ధి నమోదు చేశామన్నారు. ముఖ్యంగా థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా, మెక్సికో దేశాల్లో రెట్టింపు ఆదాయం సాధించామనీ, అలాగే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మరింత విజయవంతంగా అమ్మకాలు సాగిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్లో డీల్స్, ఆఫర్ల కారణంగా ఐఫోన్ అమ్మకాలు జోరందుకున్నాయన్నారు. -
యాపిల్ ఇండియా ఆదాయం రెట్టింపు
న్యూయార్క్: ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టెక్ దిగ్గజం యాపిల్ ఆదాయం సుమారు 2 శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో 83 బిలియన్ డాలర్లకు చేరింది. భారత మార్కెట్లో ఆదాయం దాదాపు రెట్టింపైనట్లు సంస్థ వెల్లడించింది. ‘అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్‌లోని ఇతర మార్కెట్లలో జూన్ త్రైమాసికంలో ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. సంపన్న, వర్ధమాన మార్కెట్లలో గణనీయంగా వృద్ధి చెందింది. బ్రెజిల్, ఇండొనేషియా, వియత్నాలలో రెండంకెల స్థాయిలోనూ, భారత్‌లో రెట్టింపు స్థాయిలోనూ పెరిగింది‘ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. రష్యా వ్యాపారం, స్థూల ఆర్థిక అంశాలపరంగా కొంత ప్రతికూల ప్రభావాలు పడినప్పటికీ సర్వీసుల విభాగం ఆదాయం 12 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు వివరించారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టే పెట్టుకునేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు కస్టమర్లు యాపిల్ ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కుక్ తెలిపారు. భారత ఐటీ దిగ్గజం విప్రో ఇందుకు ఉదాహరణగా ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా కొత్త గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోవడంలో ఇతర సంస్థలతో పోటీపడే క్రమంలో మాక్‌బుక్ ఎయిర్ వంటి అత్యుత్తమ పనితీరు కనపర్చే యాపిల్ ఉత్పత్తులపై విప్రో ఇన్వెస్ట్ చేస్తోందని కుక్ వివరించారు. -
భారత్‌లో యాపిల్ రికార్డు.
న్యూఢిల్లీ: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత్‌లోనూ దుమ్మురేపుతోంది. భారత్ సహా పలు మార్కెట్లలో పటిష్టమైన పనితీరు ఆసరాతో ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో యాపిల్ రికార్డు స్థాయిలో 64.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో 59 శాతం విదేశీ అమ్మకాల ద్వారా వచ్చిందే కావడం గమనార్హం. ఇక నికర లాభం 12.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సెప్టెంబర్‌లో యాపిల్ భారత్‌లో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, రీసెర్చ్ సంస్థ కెనాలిస్ వెల్లడించిన గణాంకాల ప్రకారం యాపిల్ జూలై–సెప్టెంబర్ కాలంలో రెండంకెల వృద్ధితో రికార్డు స్థాయిలో సుమారు 8 లక్షల ఐఫోన్లను విక్రయించినట్లు అంచనా. ఫాక్స్‌కాన్, విస్ట్రాన్‌ల భాగస్వామ్యంతో యాపిల్ ఇటీవలే భారత్‌లో ఐఫోన్ 11 అసెంబ్లింగ్‌ను ప్రారంభించింది. ‘భౌగోళికంగా, అమెరికా, యూరప్, మిగతా ఆసియా పసిఫిక్‌లో మేం సెప్టెంబర్ క్వార్టర్లో రికార్డులు సృష్టించాం. భారత్‌లోనూ మాకు ఇది రికార్డు క్వార్టర్‌గా నిలిచింది. తాజాగా ప్రారంభించిన ఆన్లైన్ స్టోర్‌కు భారత్‌లో అపూర్వ ఆదరణ లభించడం ఆనందం కలిగిస్తోంది’ అని ఫలితాల ప్రకటన సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పారు. -
భారత్‌లో ఆపసోపాలు పడుతున్న టెక్ దిగ్గజం
న్యూఢిల్లీ : భారత్‌లో ఐఫోన్లను విక్రయించడానికి టెక్ దిగ్గజం ఆపిల్ ఆపసోపాలు పడుతోంది. ఇటీవల వారాల్లో ముగ్గురు కీలక ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని వీడటంతో ఆపిల్ ఈ క్లిష్టతర పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలిసింది. భారత్‌లో ఆపిల్, తన వైభవాన్ని కోల్పోతుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్టు వెల్లడించింది. చైనాలో నెలకొన్న మాదిరి భారత్‌లోనూ పరిస్థితులను ఎదుర్కొంటుందని తెలిపింది. ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాతో, ఆపిల్ తన దేశీయ సేల్స్ టీమ్‌ను పునర్వ్యస్థీకరించే పనిలో పడింది. ఆపిల్ ఇండియా నేషనల్ సేల్స్, డిస్ట్రిబ్యూషన్ చీఫ్, కమర్షియల్ ఛానల్స్, మిడ్-మార్కెట్ బిజినెస్ అధినేత, టెలికాం క్యారియర్ సేల్స్ హెడ్ అందరూ కంపెనీని వీడినట్టు బ్లూమ్‌బర్గ్ రిపోర్టు పేర్కొంది. అయితే వీరందరూ ఎందుకు కంపెనీని వీడారో మాత్రం ఇంకా క్లారిటీ తెలియరాలేదు. అయితే భారత్ మార్కెట్లో ఆపిల్ ప్రదర్శనే వీరి రాజీనామాల రియాక్షన్ అని రిపోర్టు చెబుతోంది. ప్రస్తుతం భారత సేల్స్ టీమ్‌ను ఆపిల్ పునర్వ్యస్థీకరిస్తోంది. కాగ, భారత్ రెండింతలు మేర టారిఫ్‌లను పెంచడంతో, ఆపిల్ కంపెనీ సైతం తన ధరలను పెంచేసింది. ఈ ప్రభావంతో భారత్ మార్కెట్లో ఆపిల్ తన షేరును కోల్పోతుంది. ఆపిల్ కిందకి పడిపోతుంటే, చైనీస్ దిగ్గజం షావోమి, కొరియా దిగ్గజం శాంసంగ్‌లు మాత్రం భారత మార్కెట్ షేరును అంతకంతకు పెంచుకుంటూ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. 2018 ప్రథమార్థంలో కూడా ఐఫోన్ ఇండియా విక్రయాలు కిందకి పడిపోయినట్టు వెల్లడైంది. ఒకవేళ ద్వితీయార్థంలో జంప్ చేసినా.. గతేడాది కంటే తక్కువ విక్రయాలనే నమోదు చేయవచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. కంపెనీ ప్రస్తుతం దేశీయంగా పాత ఐఫోన్ల తయారీ ప్రారంభించింది. ఓ వైపు దేశీయంగా తయారీ చేపట్టినా.. దేశీయ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆపిల్ మరింత కృషిచేయాలని విశ్లేషకులంటున్నారు. -
దుమ్మురేపిన ఐఫోన్ విక్రయాలు
ఐఫోన్ విక్రయాలు దుమ్మురేపాయి. ఈ బలమైన విక్రయాలతో ఆపిల్ మూడో క్వార్టర్ ఫలితాలు అంచనాల కంటే మెరుగ్గా ఉంటాయని ప్రకటించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆపిల్ షేర్లు ఆల్‌టైమ్ గరిష్టాలను నమోదుచేశాయి. కంపెనీ అదరగొట్టిన ఐఫోన్ విక్రయాలను ప్రకటించిన వెంటనే ఇంట్రాడేలో ఆపిల్ స్టాక్ రికార్డు గరిష్టంలో 159.10 డాలర్ల స్థాయిని తాకింది. జూలై1 తో ముగిసిన క్వార్టర్లో ఐఫోన్ అమ్మకాలు 41.03 మిలియన్లగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. దీంతో 1.2 బిలియన్ ఐఫోన్ విక్రయాల మైలురాయిని తాకినట్టు ఆపిల్ ప్రకటించింది. ఐప్యాడ్ ప్రొడక్ట్‌లో కూడా అనూహ్యమైన వృద్ధిని నమోదుచేసినట్టు కంపెనీ పేర్కొంది. ఆపిల్ వాచ్ విక్రయాలు 50 శాతం పెరిగినట్టు తెలిపింది. దీంతో ఆపిల్ ఫలితాల అంచనాల్లోనూ దూసుకుపోయింది. అయితే తాజాగా శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లకు పోటీగా తీసుకురాబోతున్న తర్వాతి ఐఫోన్‌ను సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. జూలై1 తో ముగిసిన క్వార్టర్లో ఐఫోన్ అమ్మకాలు 1.6 శాతం వృద్ధి చెంది, మూడో క్వార్టర్లో 41.03 మిలియన్లగా నమోదైనట్టు ఆపిల్ తెలిపింది. ఇవి విశ్లేషకులు అంచనావేసిన 40.7 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ. గతేడాది ఆపిల్ 40.4 మిలియన్ యూనిట్లనే విక్రయించింది. ఐఫోన్ విక్రయ ధరను వాల్‌స్ట్రీట్ అంచనాల కంటే తక్కువగా ఉంచడంతో ఐఫోన్ రెవెన్యూలు పెరిగినట్టు ఆపిల్ తెలిపింది. కంపెనీ నికర ఆదాయం కూడా 8.72 బిలియన్ డాలర్లు లేదా ఒక్కో షేరుకు 1.67 డాలర్లకు పెరిగినట్టు కంపెనీ చెప్పింది. చైనాతో కలిపి ఎమర్జింగ్ మార్కెట్లలో ఆపిల్ రెవెన్యూలు 18 శాతం పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. రెవెన్యూలు 45.4 బిలియన్ డాలర్లుగా ఆపిల్ ప్రకటించింది. రాయిటర్స్ అంచనాల ప్రకారం ఇవి 44.89 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉంటాయని తెలిసింది. ఐఫోన్ సరుకు రవాణా కూడా 41 మిలియన్లకు పెరిగింది. కంపెనీ మొత్తం రెవెన్యూలు ప్రస్తుత నాలుగో క్వార్టర్లో 49 బిలియన్ నుంచి 52 బిలియన్ డాలర్ల మధ్యలో ఉంటాయని కంపెనీ అంచనావేస్తోంది. అంతేకాక విశ్లేషకులు కూడా 49.21 బిలియన్ డాలర్లుగా ఉంటాయని భావిస్తున్నారు. -
ఆపిల్ షాకింగ్ రిజల్ట్స్
-
ఆపిల్ షాకింగ్ రిజల్ట్స్
సిలికాన్ వ్యాలీ దిగ్గజం ఆపిల్ ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రకటించింది. గత 15 ఏళ్లలో మొదటిసారి కంపెనీ యాన్యువల్ విక్రయాలు, లాభాలు పడిపోయినట్టు కంపెనీ రిపోర్టు చేసింది. 1997లో దివాలా స్థానం నుంచి ప్రపంచ అత్యంత విలువైన కంపెనీగా ఎదిగిన ఆపిల్, సెప్టెంబర్‌తో ముగిసిన ఈ మూడో త్రైమాసికంలో కేవలం 215.6 బిలియన్ డాలర్ల(రూ.14,40,433కోట్ల) విలువైన ఐఫోన్స్, వాచస్ను, మ్యాక్ కంప్యూటర్లు, ఇతరాత్ర ఉత్పత్తులను మాత్రమే విక్రయించినట్టు మంగళవారం రాత్రి పేర్కొంది. గతేడాది ఈ విక్రయాలు 233.7 బిలియన్ డాలర్లు(రూ.15,61,243కోట్ల)గా నమోదయ్యాయి. కంపెనీ యాన్యువల్ విక్రయాల్లో క్షీణత, లాభాలపై దెబ్బకొట్టినట్టు ఆపిల్ ప్రకటించింది. కంపెనీ లాభాలు దాదాపు 14 శాతం పడిపోయి, 45.7 బిలియన్ డాలర్లు(రూ.3,05,298కోట్ల)గా నమోదైనట్టు తెలిపింది. 2001 తర్వాత మొదటిసారి ఆపిల్ కంపెనీ యాన్యువల్ విక్రయాలు, లాభాలు పడిపోయాయని కంపెనీ వెల్లడించింది.. ఈ మూడు నెలల త్రైమాసికంలో ఆపిల్ విక్రయాలు 9 శాతం క్షీణించి 46.85 బిలియన్ డాలర్లుగా రికార్డయినట్టు పేర్కొంది. ఈ విక్రయాల క్షీణత గతేడాది ఇదే కాలంతో పోలిస్తే క్వార్టర్లీ లాభాలు 9 బిలియన్ డాలర్లు క్షీణించడానికి దోహదం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ విక్రయాలు పడిపోయినప్పటికీ, భారత్ మార్కెట్లో మాత్రం కంపెనీకి మెరుగైన ఫలితాలనే కంపెనీ నమోదుచేసింది. గతేడాది పోలిస్తే ఈ ఏడాది భారత్‌లో ఐఫోన్ విక్రయాలు 50 శాతం మేర ఎగబాకాయని ఆపిల్ పేర్కొంది. రిలయన్స్ జియో ఐఫోన్ ఆఫర్‌తో ఈ వృద్ధి మరింత నమోదవుతుందని కంపెనీ ఆశిస్తోంది. దీంతో ఆపిల్ ప్రస్తుతం భారత్ మార్కెట్‌పై ఎక్కువగా దృష్టిసారించనున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో భారత్‌లో మరింత వృద్ధికి తోడ్పతామని సీఈవో టిమ్ కుక్ తెలిపారు. యాన్యువల్ విక్రయాలు, లాభాలు పడిపోయినప్పటికీ, కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఫలితాలపై సానుకూల అభిప్రాయాన్నే వ్యక్తంచేశారు. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు ఆపిల్ కంపెనీకి 2016 విజయవంతమైన ఆర్థికసంవత్సరంగా చూపించినట్టు పేర్కొన్నారు. ఇటీవల విడుదల చేసిన కొత్త ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్, ఆపిల్ వాచ్ సిరీస్ 2లకు కస్టమర్ల నుంచి వస్తున్న అనూహ్య స్పందన చూసి తాము మురిసిపోతున్నట్టు తెలిపారు. 2007 జూన్‌లో మొదటిసారి ఐఫోన్‌ను ఆవిష్కరించామని, ప్రస్తుతం టెలికాం పరిశ్రమలో గూగుల్ వంటి కంపెనీలతో తీవ్రమైన పోటీ నెలకొన్నట్టు పేర్కొన్నారు. గూగుల్ ఇటీవలే తన సొంత బ్రాండులో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. చైనా వంటి కీలకమైన మార్కెట్లలో కూడా చౌకైన ధరల్లో స్మార్ట్ఫోన్లు లభ్యమవుతున్నాయని, దీంతో ఐఫోన్‌కు తీవ్రమైన పోటీ నెలకొన్నట్టు టిమ్ కుక్ అభిప్రాయం వ్యక్తంచేశారు. సెప్టెంబర్ 16న మార్కెట్లలలోకి అందుబాటులోకి వచ్చిన ఐఫోన్ 7కు డిమాండ్ అమాంతం పెరగడంతో, సప్లై సమస్యతో కంపెనీ కొంత సతమతమైంది. కానీ స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ గెలాక్సీ నోట్7 పేలిపోవడం ఆపిల్‌కు అనుకూలించి, విక్రయాలను కంపెనీ పెంచుకోగలిగింది. -
ఈ వారంలో భారత్‌కు టిమ్ కుక్!
న్యూఢిల్లీ: యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌లో పర్యటించే అవకాశముంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను కలిగిన భారత్‌లో వృద్ధి అవకాశాలను ఒడిసిపట్టుకోవాలనే ఉద్దేశంతో.. ఈయన ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. కుక్ దేశీ టెక్నాలజీ మార్కెట్ సామర్థ్యం, భారత్‌లో తయారీ వంటి అంశాల గురించి మోదీతో చర్చించవచ్చు. అయితే యాపిల్ మాత్రం కుక్ షెడ్యూల్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కంపెనీ ఐఫోన్ విక్రయాలు తొలిసారి తగ్గిన నేపథ్యంలో.. వర్థమాన దేశాల్లో వృద్ధి కోసం కొత్త మార్గాల అన్వేషిస్తున్న సమయంలో.. కుక్ దేశీ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కుక్ మాట్లాడుతూ.. భారత్‌లో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, అందుకే ఆ దేశంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. కాగా చైనాలో ఐఫోన్ విక్రయాలు తగ్గితే.. మన దేశంలో మాత్రం పెరిగాయి. -
ఐఫోన్‌కు కలిసి రాని కాలం
ఐఫోన్... ఓ బ్రాండ్, ఓ ఇమేజ్ అంటూ వినియోగదారుల మదిలో తెగ ఆశలు కల్పించిన యాపిల్ కంపెనీకి 2016 నిరాశపరుస్తోంది. తాజాగా విడుదల చేసిన ఐఫోన్ ఎస్ఈ మోడల్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. గతవారం ఐఫోన్ ఎస్ఈ అమ్మకాలు మొత్తం ఐఫోన్ మోడల్ ఫోన్లలో 0.1 శాతం మాత్రమేనని లోకలిస్టిక్ సర్వేలు వెల్లడించాయి. పాత ఐఫోన్ మోడళ్ల కంటే వీటి అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయన్నాయి. పాత మోడళ్లకు కొన్ని లేటెస్ట్ ఫీచర్లను కలిపిన యాపిల్, ఐఫోన్ ఎస్ఈని 399 డాలర్లతో (రూ.26,557) మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కాని ఆ ఫోన్ విడుదలైనప్పటి నుంచి ఐఫోన్ అమ్మకాలు ఏ మాత్రం పెరగలేదు. ఐఫోన్ 7ఎస్ మోడల్ విడుదల చేసినా కూడా అది ఈ ఫోన్ అమ్మకాలను పెద్దగా కాపాడగలిగే పరిస్థితి లేదని సర్వేలు చెబుతున్నాయి.