దేశీయ స్టాక్‌మార్కెట్లు సరికొత్త రికార్డుల మోత మోగించాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 39వేలపాయింట్ల వద్ద సరికొత్త ఆల్ టైం హైని తాకగా, నిఫ్టీ 11700 స్థాయికి పైన ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అటు బ్యాంక్ నిఫ్టీ కూడా 30,646 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని చేరుకోగా.. సరికొత్త రికార్డుకు నిఫ్టీ 60 పాయింట్ల దూరంలో నిలిచింది. ఆరంభంలోనే ట్రిపుల్ సెంచరీ లాభాలను సాధించిన సెన్సెక్స్ తన జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుతం 384 పాయింట్లు ఎగిసి 39057 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు లాబంతో 11724 వద్ద కొనసాగుతోంది. ఆర్‌బీఐ వడ్డీరేటు కోత అంచనాలకు తోడు, ఇది ఎన్నికల ముందు మార్కెట్లలో భారీ ర్యాలీగా నిపుణులు పేర్కొంటున్నారు.
అన్ని రంగాలూ లాభపడుతుండగా, పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్ 2.75 శాతం చొప్పున ఎగశాయి. అలాగే ఐటీ, ఆటో 1.5 శాతం చొప్పున బలపడ్డాయి. ప్రభుత్వ బ్యాంక్స్‌లో జేఅండ్‌కే, సిండికేట్, పీఎన్‌బీ, బీవోబీ, యూనియన్, బీవోఐ, కెనరా, అలహాబాద్, సెంట్రల్, ఇండియన్ బ్యాంక్ టాప్‌విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు టాటా మోటార్స్, హిందాల్కో, వేదాంతా, గెయిల్, టాటా స్టీల్, విప్రో, మారుతీ, ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్ 6-2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐవోసీ, యూపీఎల్, ఇండస్‌ఇండ్, జీ, ఐబీ హౌసింగ్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, ఐషర్, టైటన్, కోల్ ఇండియా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment