న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్రం రూ.2.5 మేర తగ్గించిందని సంతోషించేలోపే ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు మళ్లీ షాకిచ్చాయి. ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 14 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెంచు తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.87.29కి చేరుకోగా, డీజిల్ రూ.77.06కు పెరిగింది. దీంతో పెట్రోల్ ధరలు మళ్లీ మూడువారాల గరిష్టానికి చేరుకున్నట్లయింది. పెట్రోలియం ఉత్పత్తులపై రూ.2.5ను తగ్గిస్తూ అక్టోబర్ 4న కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం లీటర్ పెట్రోల్‌పై 18 పైసలు, డీజిల్‌పై 29 పైసలను పెంచా యి. తాజా నిర్ణయంతో 2014 నుంచి ఇప్పటివ రకూ పెట్రోల్‌పై రూ.11.77, డీజిల్‌పై రూ.13.47ను ప్రభుత్వం పెంచినట్లయింది. కాగా, రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేంద్రం రూ.2.5 మేర ధరల్ని తగ్గించిందని కాంగ్రెస్ ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment