సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సరికొత్త శిఖాలకు చేరాయి. గత వారం ఫ్లాట్‌గా ట్రేడ్ అయిన సూచీలు సోమవారం భారీగా ర్యాలీ అవుతున్నాయి. దీంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 52 వేల మార్కును అధిగమించి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 503 పాయింట్ల లాభంతో 52047వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో 15290 వద్ద కొనసాగుతున్నాయి. అటు బ్యాంకింగ్ కౌంటర్ కూడా శుక్రవారం నాటి జోష్‌ను కొనసాగిస్తోంది. 641పాయింట్ల లాభంతో 36750 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల ధోరణి నెలకొంది.
ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌గా ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్ లాభంతో ఉన్నాయి.ఇండెక్స్ హెవీవెయిట్స్ ఇన్ఫోసిస్ రిలయన్స్ ఇండస్ట్రీస్,ఎస్‌బీఐ కూడా లాభపడుతున్నాయి. మరోవైపు ఓఎన్‌జీసీ. టెక్ మహీంద్రా.ఎస్‌బీఐ లైఫ్, హీరోమోటోకార్ప్ , కోల్ ఇండియా నష్టపోతున్నాయి. అటు చమురు ధరలు ఏడాది గరిష్టానికి చేరాయి. బ్రెంట్ ముడి 66 సెంట్లు లేదా 1.1 శాతం పెరిగి బ్యారెల్ 63.09 డాలర్లకు చేరుకుంది. ఇది జనవరి 22, 2020 నుండి అత్యధికం.
Comments
Please login to add a commentAdd a comment