
సాక్షి, ముంబై: డాలరు మారకంలో రూపాయి అత్యంత కనిష్టాన్ని నమోదు చేసింది. రూపాయి క్షీణతను అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినప్పటికీ రుపీ పతనం ఆగలేదు. మంగళవారం డాలరు మారకంలో రూ.72.97 స్థాయిని తాకింది. ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి 46 పైసలు క్షీణించి మరో చారిత్రాత్మక కనిష్టం 73 స్థాయికి చేరువలో ముగిసింది.
పెరుగుతున్న చమురు ధరలకు తోడు వాణిజ్యలోటు వర్తక లోటు, అంతర్జాతీయ అంశాలు రూపాయి విలువను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు మసాలా బాండ్లపై ఉపసంహరణ పన్ను తొలగింపు, ఎఫ్‌పీఐల సడలింపు, దిగుమతి సుంకం పెంపు, క్యాడ్ నియంత్రణ లాంటి చర్యల్ని చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment