
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంలో కొంత వెనుకంజ వేసినా తర్వాత పుంజుకున్న కీలక సూచీలు మరోసారి రికార్డు స్థాయిల వద్ద ఉత్సాహంగా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 222 పాయింట్లు ఎగిసి 37,887 వద్ద, నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి11,450వద్ద ముగిసాయి. మీడియా, బ్యాంక్ నిఫ్టీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ రంగాల లాభాలు మార్కెట్లకు ఊత మిచ్చాయి. మరోవైపు ఐటీ, ఫార్మా రంగాలు స్వల్పంగా నష్టపోయాయి. టాటామోటార్స్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్, ఆర్‌ఐఎల్, హెచ్‌యూఎల్, అల్ట్రాటెక్, ఐబీ హౌసింగ్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ లాభాలతో మురిపించగా, హెచ్‌పీసీఎల్, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, ఐవోసీ నష్టాల్లో ముగిసాయి.
Comments
Please login to add a commentAdd a comment