మహిళా గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తున్న విపక్ష ఎంపీలు
ఇంఫాల్: మణిపూర్‌లో జాతి వైషమ్యాలను అదుపుచేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఆరోపించింది. మణిపూర్ సమస్యను పరిష్కరించడంలో ప్రధాని మోదీ తీవ్ర ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారని పేర్కొంది. సత్వరమే పరిష్కరించకుంటే దేశ భద్రతకు సైతం సమస్యగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు ఈ మేరకు ఆదివారం రాష్ట్ర మహిళా గవర్నర్ అనసూయ ఉయికేకు ఇచి్చన వినతి పత్రంలో పేర్కొన్నారు.
వారు శని,ఆదివారాల్లో మణిపూర్‌లో సుడిగాలి పర్యటన చేశారు. బాధిత ప్రజలకు తక్షణమే పునరావాసం కలి్పంచాలని, రాష్ట్రంలో శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా కాల్పులు, గృహ దహన ఘటనలు కొనసాగుతుండటాన్ని బట్టి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.
గడిచిన మూడు నెలలుగా రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతుండటంతో వదంతులు వ్యాప్తి చెంది జాతుల మధ్య విభేదాలు మరింతగా పెరిగాయన్నారు. జాతుల మధ్య పెరిగిన వైషమ్యాలను తక్షణమే చల్లార్చాల్సిన అవసరముందన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో తక్షణమే సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని గవర్నర్‌కు విపక్ష ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
మణిపూర్‌లో బయోమెట్రిక్ సర్వే
2021 సంవత్సరంలో మయన్మార్ దేశంలో సైనిక జుంటా అధికారంలోకి వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్లోకి పెరిగిన వలసలపై కేంద్రం అప్రమత్తమైంది. అక్రమంగా ప్రవేశించిన మయన్మార్ దేశస్తులను గుర్తించేందుకు బయోమెట్రిక్ సర్వే చేపట్టాలంటూ కేంద్రప్రభుత్వం ఇటీవల మణిపూర్, మిజోరం రాష్ట్రాలను ఆదేశించింది. మిజోరంలోని మొత్తం 11 జిల్లాల్లో కలిపి 30 వేల మందికిపైగా మయన్మార్ దేశస్తులున్నట్లు అంచనా.
కేంద్రం నుంచి అందిన ఆదేశాల మేరకు ప్రస్తుతం సహాయక శిబిరాల్లో సర్వే చేపట్టినట్లు మిజోరం ముఖ్యమంత్రి లాల్ థంగ్లియానా ఆదివారం చెప్పారు. సెపె్టంబర్ 30వ తేదీలోగా మయన్మార్ దేశస్తుల నమోదు పూర్తి చేయాలని కేంద్ర హోం శాఖ కోరిందన్నారు. తమ వర్గానికి చెందిన వారే అయినందున తిరిగి మయన్మార్ పంపించలేక వారికి మానవతాదృక్పథంలో ఆశ్రయం కలి్పస్తున్నట్లు తెలిపారు. కొందరు బంధువుల వద్ద, అద్దె ఇళ్లలో ఉంటుండగా ఎక్కువ మంది సహాయ శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment