govt failures
-
Manipur violence: హింస నివారణలో ప్రభుత్వం విఫలం
ఇంఫాల్: మణిపూర్‌లో జాతి వైషమ్యాలను అదుపుచేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఆరోపించింది. మణిపూర్ సమస్యను పరిష్కరించడంలో ప్రధాని మోదీ తీవ్ర ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారని పేర్కొంది. సత్వరమే పరిష్కరించకుంటే దేశ భద్రతకు సైతం సమస్యగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు ఈ మేరకు ఆదివారం రాష్ట్ర మహిళా గవర్నర్ అనసూయ ఉయికేకు ఇచి్చన వినతి పత్రంలో పేర్కొన్నారు. వారు శని,ఆదివారాల్లో మణిపూర్‌లో సుడిగాలి పర్యటన చేశారు. బాధిత ప్రజలకు తక్షణమే పునరావాసం కలి్పంచాలని, రాష్ట్రంలో శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా కాల్పులు, గృహ దహన ఘటనలు కొనసాగుతుండటాన్ని బట్టి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. గడిచిన మూడు నెలలుగా రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతుండటంతో వదంతులు వ్యాప్తి చెంది జాతుల మధ్య విభేదాలు మరింతగా పెరిగాయన్నారు. జాతుల మధ్య పెరిగిన వైషమ్యాలను తక్షణమే చల్లార్చాల్సిన అవసరముందన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో తక్షణమే సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని గవర్నర్‌కు విపక్ష ఎంపీలు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో బయోమెట్రిక్ సర్వే 2021 సంవత్సరంలో మయన్మార్ దేశంలో సైనిక జుంటా అధికారంలోకి వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్లోకి పెరిగిన వలసలపై కేంద్రం అప్రమత్తమైంది. అక్రమంగా ప్రవేశించిన మయన్మార్ దేశస్తులను గుర్తించేందుకు బయోమెట్రిక్ సర్వే చేపట్టాలంటూ కేంద్రప్రభుత్వం ఇటీవల మణిపూర్, మిజోరం రాష్ట్రాలను ఆదేశించింది. మిజోరంలోని మొత్తం 11 జిల్లాల్లో కలిపి 30 వేల మందికిపైగా మయన్మార్ దేశస్తులున్నట్లు అంచనా. కేంద్రం నుంచి అందిన ఆదేశాల మేరకు ప్రస్తుతం సహాయక శిబిరాల్లో సర్వే చేపట్టినట్లు మిజోరం ముఖ్యమంత్రి లాల్ థంగ్లియానా ఆదివారం చెప్పారు. సెపె్టంబర్ 30వ తేదీలోగా మయన్మార్ దేశస్తుల నమోదు పూర్తి చేయాలని కేంద్ర హోం శాఖ కోరిందన్నారు. తమ వర్గానికి చెందిన వారే అయినందున తిరిగి మయన్మార్ పంపించలేక వారికి మానవతాదృక్పథంలో ఆశ్రయం కలి్పస్తున్నట్లు తెలిపారు. కొందరు బంధువుల వద్ద, అద్దె ఇళ్లలో ఉంటుండగా ఎక్కువ మంది సహాయ శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారని చెప్పారు. -
సర్కార్ వైఫల్యాలే అజెండాగా ప్లీనరీలు
సాక్షిప్రతినిధి, కాకినాడ : ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలపై చర్చ ప్రధాన అజెండాగా సాగుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్లీనరీలు పార్టీ శ్రేణులకు ఉత్తేజాని్నస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ¯ŒSమోహనరెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో గురువారం ప్రారంభమైన ప్లీనరీలు రెండో రోజు శుక్రవారం రామచంద్రపురం, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో జరిగాయి. కోఆరి్డనేటర్ ముత్తా శశిధర్ అధ్యక్షతన జరిగిన సిటీ ప్లీనరీకి పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటు కోఆరి్డనేటర్ చలమలశెట్టి సునీల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ సర్కార్ వైఫల్యాలను కార్యకర్తల సమక్షంలో చర్చించి ప్రభుత్వ తీరు ఎండగట్టేందుకు నియోజకవర్గ ప్లీనరీలు దిశానిర్దేశం చేస్తాయని వారు నొక్కి చెప్పారు. కాకినాడ సిటీ ప్లీనరీ సూర్యకళామందిరంలో జరుగగా నియోజకవర్గ కోఆరి్డనేటర్ ముత్తా శశిధర్, సిటీ ప్రెసిడెంట్ ఫ్రూటీకుమార్, కోఆరి్డనేటర్ ముత్యాల శ్రీనివాస్, తోట నాయుడు, మాజీ మంత్రులు కొప్పన మోహనరావు, ముత్తా గోపాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్ తదితరులు కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. రామచంద్రపురం లయ¯Œ్స కల్యాణమండపంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో 18 తీర్మానాలు ప్రవేశపెట్టారు. చంద్రబాబు ఉగ్గుపాలతో అవినీతిని నేర్పిస్తూ, ప్రోత్సహిస్తున్న తీరును గ్రామగ్రామాన ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్సీ బోస్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తదితరులు కేడర్‌కు సూచించారు. వర్థంతికి, జయంతికి తేడా తెలియకుండా మాట్లాడుతున్న లోకేశ్‌ను మంత్రి చేయడంతోనే బాబు నిజరూపం బయటపడిందని నేతలు ఆక్షేపించారు. ప్రతి కార్యకర్త టీడీపీ అక్రమాలను, వైఎస్సార్‌పై చేస్తోన్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని నేతలు కార్యకర్తలకు నూరిపోశారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టబ్బాయి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, కోఆరి్డనేటర్లు పర్వత ప్రసాద్, పితాని బాలకృష్ణ, ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, వేగుళ్ల లీలాకృష్ణ, వేగుళ్ల పట్టాభిరామయ్య, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వలవల బాబ్జీ, కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహనరావు, రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేడర్ పెద్ద ఎత్తున పాల్గొంది.