సర్కార్ వైఫల్యాలే అజెండాగా ప్లీనరీలు
సర్కార్ వైఫల్యాలే అజెండాగా ప్లీనరీలు
Published Fri, Jun 2 2017 11:33 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
సాక్షిప్రతినిధి, కాకినాడ :
ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలపై చర్చ ప్రధాన అజెండాగా సాగుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్లీనరీలు పార్టీ శ్రేణులకు ఉత్తేజాని్నస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ¯ŒSమోహనరెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో గురువారం ప్రారంభమైన ప్లీనరీలు రెండో రోజు శుక్రవారం రామచంద్రపురం, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో జరిగాయి. కోఆరి్డనేటర్ ముత్తా శశిధర్ అధ్యక్షతన జరిగిన సిటీ ప్లీనరీకి పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటు కోఆరి్డనేటర్ చలమలశెట్టి సునీల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ సర్కార్ వైఫల్యాలను కార్యకర్తల సమక్షంలో చర్చించి ప్రభుత్వ తీరు ఎండగట్టేందుకు నియోజకవర్గ ప్లీనరీలు దిశానిర్దేశం చేస్తాయని వారు నొక్కి చెప్పారు. కాకినాడ సిటీ ప్లీనరీ సూర్యకళామందిరంలో జరుగగా నియోజకవర్గ కోఆరి్డనేటర్ ముత్తా శశిధర్, సిటీ ప్రెసిడెంట్ ఫ్రూటీకుమార్, కోఆరి్డనేటర్ ముత్యాల శ్రీనివాస్, తోట నాయుడు, మాజీ మంత్రులు కొప్పన మోహనరావు, ముత్తా గోపాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్ తదితరులు కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. రామచంద్రపురం లయ¯Œ్స కల్యాణమండపంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో 18 తీర్మానాలు ప్రవేశపెట్టారు. చంద్రబాబు ఉగ్గుపాలతో అవినీతిని నేర్పిస్తూ, ప్రోత్సహిస్తున్న తీరును గ్రామగ్రామాన ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్సీ బోస్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తదితరులు కేడర్‌కు సూచించారు. వర్థంతికి, జయంతికి తేడా తెలియకుండా మాట్లాడుతున్న లోకేశ్‌ను మంత్రి చేయడంతోనే బాబు నిజరూపం బయటపడిందని నేతలు ఆక్షేపించారు. ప్రతి కార్యకర్త టీడీపీ అక్రమాలను, వైఎస్సార్‌పై చేస్తోన్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని నేతలు కార్యకర్తలకు నూరిపోశారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టబ్బాయి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, కోఆరి్డనేటర్‌లు పర్వత ప్రసాద్, పితాని బాలకృష్ణ, ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, వేగుళ్ల లీలాకృష్ణ, వేగుళ్ల పట్టాభిరామయ్య, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వలవల బాబ్జీ, కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహనరావు, రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేడర్ పెద్ద ఎత్తున పాల్గొంది.
Advertisement
Advertisement