ajenda
-
రూపాయిలో ట్రేడింగ్.. భారత్ ‘జీ 20’ అజెండా
ముంబై: భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ–20 సమావేశాల్లో ‘రూపాయిలో ట్రేడింగ్’ అజెండాను ముందుకు తీసుకువెళ్లాలని కేంద్రం భావిస్తోందని, ఇందుకు అనుగుణంగా వ్యూహ రచన చేస్తోందని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ పేర్కొన్నారు. ముఖ్యంగా కరెన్సీ ఒత్తిడిలో ఉన్న దేశాలకు రూపాయి వాణిజ్యం ఉపయోగపడుతుందని వాణిజ్య కార్యదర్శి ఇక్కడ విలేకరులతో అన్నారు. అయితే జీ–20 ఫోరమ్‌తో రూపాయి వాణిజ్యానికి నేరుగా సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న కీలక సమావేశం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీ–20 దేశాలు, ప్రత్యేక ఆహ్వానితులుసహా దాదాపు 100 మంది ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ సమావేశం చర్చించే అంశాల్లో వాణిజ్యం– వృద్ది మధ్య మరింత సమతౌల్యత సాధించడం, ప్రపంచ సరఫరాల చైన్‌ను ఆటుపోట్లను తట్టుకునేలా చర్యలు తీసుకోవడం, వాణిజ్యంలో చిన్న వ్యాపారాలను ఏకీకృతం చేయడం, నిబంధనలలో ఏకరూపత సాధించడం, తద్వారా లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడానికి మార్గాలు వంటి అంశాలు ఉన్నాయని బరŠాత్వల్ చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు సంబంధించి భారత్ కొన్ని సంస్కరణలను ప్రతిపాదిస్తున్నదని పేర్కొన్న వాణిజ్య కార్యదర్శి, గుజరాత్‌లోని కెవాడియాలో జరిగే వాణిజ్య, పెట్టుబడి వర్కింగ్ గ్రూప్ తదుపరి సమావేశ ఎజెండాలో ఇదే ప్రధాన అంశమని తెలిపారు. రూపాయి మారకంలో అంతర్జాతీయంగా ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించడంపై ఇతర దేశాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు సంబంధించి 18 దేశాలకు చెందిన బ్యాంకులు.. భారతీయ బ్యాంకుల్లో 30 పైచిలుకు ప్రత్యేక వోస్ట్రో ఖాతాలను తెరిచాయి. లావాదేవీలూ స్వల్ప స్థాయిలో ప్రారంభమైనట్లు వివరించారు. రూపాయి మారకంలో చెల్లింపుల సెటిల్మెంట్కు వోస్ట్రో ఖాతాలు దోహదపడతాయి. రూపాయల్లో వాణిజ్యానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్బీఐ గతేడాది జూలైలో ప్రకటించిన తర్వాత తొలుత రష్యాకు చెందిన సిబెర్ బ్యాంక్, వీటీబీ బ్యాంక్ ఈ ఖాతాలు తెరిచాయి. -
Andhra Pradesh: ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించిన కేంద్రం
-
ఏపీకి ప్రత్యేక హోదా.. అజెండా నుంచి తొలగించిన కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్రం నిర్వహించనున్న భేటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమావేశంలో చర్చించే ప్రధాన అజెండా నుంచి ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ తాజాగా తొలగించింది. అజెండాలో మార్పులు చేస్తూ తాజాగా మరో సర్య్కూలర్ జారీ చేసింది. రాజకీయంగా చర్చనీయాంశమైన ప్రత్యేక హోదాను అజెండా నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. త్రిసభ్య కమిటీలో చర్చించాల్సిన 9 అంశాల నుంచి అయిదు అంశాలకే పరిమితం చేసింది. తొలుత ప్రత్యేక హోదా, వెనకబడిన జిల్లాలకు నిధులు సహా తొమ్మిది అంశాలను అజెండాలో పేర్కొన్న కేంద్ర హోంశాఖ.. ఆ తర్వాత ప్రత్యేక హోదాను తొలగించింది. ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు, వెనకబడిన జిల్లాలకు నిధులు, వనరుల సర్దుబాటు అంశాలను తొలగిస్తున్నట్లు సర్క్యూలర్ జారీ చేసింది. కాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈనెల 17న కీలక సమావేశం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉన్నారు. శనివారం ఉదయం త్రిసభ్య కమిటీ ఎజెండాలో పేర్కొన్న 9 అంశాలు... ఎజెండా1: ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన ఎజెండా 2: ఏపీ- తెలంగాణ మధ్య విద్యుత్ వినియోగ సమస్యపై పరిష్కారం ఎజెండా 3: పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం ఎజెండా 4: రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు ఎజెండా 5: ఏపీఎస్సీఎస్సీఎల్, టీఎస్సీఎస్సీఎల్ మధ్య నగదు ఖాతాల విభజన ఎజెండా 6: ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ ఎజెండా 7: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జాల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు ఎజెండా 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎజెండా 9: రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు ... ► ఇందులో మొదటి అయిదు అంశాలను అలాగే ఉంచి.. చివరి నాలుగు అంశాలను కేంద్ర హోంశాఖ తొలగించింది. -
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి పోరాటం
-
త్రిసభ్య కమిటీ అజెండాలో కీలక అంశాలు
-
కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రత్యేకహోదా
-
ఏపీ ప్రత్యేక హోదా అంశం: చర్చలకు రావాలని కేంద్ర హోంశాఖ ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఈ మేరకు ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఈ నెల 17న చర్చలకు రావాలని రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ ఆహ్వానం పంపించింది. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉన్నారు. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై 9 అంశాలపై చర్చ జరుపుతారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఏపీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగెస్ పార్టీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. జనవరి మొదటివారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని కలిసి ఏపీ ప్రత్యేక హోదాతో పాటు, రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. త్రిసభ్య కమిటీ ఎజెండాలో 9 అంశాలు... ఎజెండా1: ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన ఎజెండా 2: ఏపీ- తెలంగాణ మధ్య విద్యుత్ వినియోగ సమస్యపై పరిష్కారం ఎజెండా 3: పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం ఎజెండా 4: రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు ఎజెండా 5: ఏపీఎస్సీఎస్సీఎల్, టీఎస్సీఎస్సీఎల్ మధ్య నగదు ఖాతాల విభజన ఎజెండా 6: ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ ఎజెండా 7: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జాల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు ఎజెండా 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎజెండా 9: రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు -
‘పీపీపీ’ ఇంకా బలపడాలి
న్యూఢిల్లీ: ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం మరింత బలపడాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి సవాళ్లు, సమస్యల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామ్యం పంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరిగి భారీ మెజారిటీని సొంతం చేసుకున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి నీతి ఆయోగ్ ఎజెండా నిర్దేశించింది. ఆయా అంశాలపై రాజీవ్ కుమార్ మీడియాతో పంచుకున్న అంశాలను క్లుప్తంగా చూస్తే... పెట్టుబడిదారు విశ్వాసం పెరగాలి వృద్ధి వేగం పుంజుకోవాలి. ముఖ్యంగా వచ్చే మూడు దశాబ్దాల కాలంలో వృద్ధి రేటు రెండంకెల్లో స్థిరపడాలి. ఇందుకు సంబంధించి గడచిన ఐదేళ్ల కాలంలో పటిష్ట పునాదులే పడ్డాయి. ఆర్థిక వ్యవస్థ సరళీకరణ, పాలనా ప్రమాణాల మెరుగుదల, ప్రభుత్వ సేవల విస్తృతి వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. వృద్ధి ఫలాలు అందరికీ అందడం లేదన్న తీవ్ర ఆందోళన ఇప్పుడు లేదు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ వంటి అంశాలు వ్యవస్థలో సానుకూల మార్పులకే దోహదపడ్డాయి. ఇదే ఒరవడి కొనసాగాలి. ఇది జరగాలంటే పలు అంశాల పట్ల ప్రైవేటు పెట్టుబడిదారు విశ్వాసం మరింత మెరుగుపడాలి. వృద్ధికి, ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇన్వెస్టర్లో ఏర్పడాలి. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వృద్ధి బాగుంది... స్పీడ్ పెరగాలి... గడచిన ఐదు సంవత్సరాల్లో దేశ ఆర్థికాభివృద్ధి తీవ్ర ఇబ్బందుల నుంచి బయటపడింది. స్థిరత్వాన్ని సాధించింది. వరుసగా ఐదు సంవత్సరాలు సగటున 7% వృద్ధి రేటును సాధించిన కాలాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. అదే సమయంలో ద్రవ్యోల్బణం పూర్తి అదుపులో కేవలం 3 శాతంగా కొనసాగింది. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం పట్ల నికర వ్యత్యాసం కరెంట్ అకౌంట్ లోటు పూర్తి నియంత్రణలో ఉంది. ఇలా ఆర్థిక రంగానికి సంబంధించి ప్రతి అంశమూ అదుపులోనే ఉంది. దేశం వృద్ధి స్పీడ్ మున్ముందు మరింత పెరగడానికి ఈ అంశాలు అన్నీ దోహదపడతాయి. ప్రైవేటు పెట్టుబడులకు ప్రాధాన్యత ఇకపై ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాలి. ప్రతి ఒక్కదానినీ ప్రభుత్వం ఒక్కటే చేయలేదన్న విషయం ఇక్కడ గుర్తెరగాలి. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య పటిష్ట పునరుద్ధరణ జరగాలి. ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి సవాళ్లు, సమస్యల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామ్యం పంచుకోవాలి. ఉదాహరణకు భూ సేకరణ విషయంలో ప్రైవేటు రంగానికి కొంత ఇబ్బందులు ఎదురవవచ్చు. ఇక్కడ ప్రభుత్వం ఈక్విటీ హోల్డర్‌గా ఈ వెంచర్లో ఉంటే సమస్య చాలా వరకూ పరిష్కారం అవుతుంది. ఈ విషయంలో మనం చైనాను ఆదర్శంగా తీసుకోవాలి. దేశంలో కూడా విశ్వసనీయత ప్రాతిపదికన ప్రభుత్వ–ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయాలి. ఎగుమతులు పెరగాలి ఎగుమతుల విషయంలోనూ గణనీయమైన మార్పులు రావాలి. ఎగుమతుల ఆధారిత విదేశీ పెట్టుబడులు అవసరం. ఎగుమతుల పెరుగుదలకు ఈ తరహా చర్యలు దోహదపడతాయి. వృద్ధికి దోహదపడతాయి. పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట పరోక్ష పన్నుల విషయానికి వస్తే, జీఎస్టీ వసూళ్లు మార్చి, ఏప్రిల్ నెలల్లో బాగున్నాయి. భవిష్యత్తులోనూ మరింత పెరుగుతాయన్న విశ్వాసం ఉంది. ఇక ప్రత్యక్ష పన్ను వసూళ్లూ బాగున్నాయి.మౌలికరంగం అభివృద్ధి, పెట్టుబడులు, ద్రవ్యలోటు కట్టడి వంటి విషయాల్లో మరిన్ని నిధులు కేంద్రానికి అవసరం. పెట్టుబడుల ఉపసంహరణ ఇందులో కీలకమైనది. 40 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు నీతి ఆయోగ్ ప్రతిపాదనలు చేసింది. దీనికి క్యాబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. ఈ దిశలో తదుపరి చర్యలు అవసరం. ఎయిర్ ఇండియా వంటి రంగాల్లో మెజారిటీ వాటాల అమ్మకాన్నీ ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. త్వరలో విధానపరమైన చర్యలు ఉంటాయి. వ్యవసాయంలో సాంకేతికత ఇక వ్యవసాయ రంగం విషయంలో తీవ్ర ప్రతికూలత ఉందని భావించకూడదు. అదే నిజమైతే ఇప్పుడు కేంద్రంలోని అధికార పార్టీకి ఇంత భారీ మెజారిటీ వచ్చి ఉండేది కాదు. ఇక తృణ ధాన్యాలు, వరి, గోధుమలకు సంబంధించి వినియోగంకన్నా ఉత్పత్తి అధికమైంది. అందువల్ల మనకు మిగులు ఉంది. అయితే ఇతర దేశాలతో పోల్చితే ఉత్పత్తి వ్యయాలు అధికంగా ఉన్నందువల్ల ఆయా ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోతున్నాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో వికేంద్రీకరణ జరగాలి. వివిధ మార్గాల ద్వారా రైతుల ఆదాయం పెరగాలి. ఆగ్రో పాసెసింగ్ ఇందులో ఒకటి. ఆగ్రో ప్రాసెసింగ్‌పై మరింత దృష్టి పెట్టాలి. ఇక్కడ పెట్టుబడులు మరింత పెరగాలి. మన ఆహార ఉత్పత్తిలో కేవలం 10 శాతం మాత్రమే ప్రాసెసింగ్ జరుగుతోంది. ఇక వ్యవసాయ రంగంలో సాంకేతికత మరింత పెరగాలి. ఆయా అంశాల ద్వారా వ్యవసాయ రంగంలో వ్యయాలు తగ్గుదల, ఎగుమతులు పెంపు, రైతు ఆదాయం మెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించవచ్చు. -
‘మహబూబ్‌నగర్ ప్రజా ఎజెండా’ విడుదల
హైదరాబాద్: అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరుకు తెలంగాణ వచ్చాక న్యాయం జరుగుతుందని భావించామని, కాని పాలకులు నిరాశకు గురిచేశారని పాలమూరు అధ్యయన వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలమూరు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారికి ఏం కావాలి వంటి అంశాలతో పాలమూరు అధ్యయన వేదిక ‘మహబూబ్‌నగర్ ప్రజా ఎజెండా’ను రూపొందించింది. దీనిని బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాలమూరులో కృష్ణానది 300 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నా, తుంగభద్ర లాంటి రెండు జీవనదులు ఉన్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నీరు లేకపోవడమే కాకుండా, జోగినీ వ్యవస్థ, అనారోగ్య సమస్యలు, విద్యా వ్యవస్థ సరిగా లేకపోవడం, పరిశ్రమలు లేకపోవడం వంటి వాటి వల్ల వెనుకబడిన జిల్లాగా మారిందన్నారు. ఎన్నికల సమయంలో పాలమూరు సమస్యను అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లేందుకు, ఓట్ల కోసం వచ్చేవారికి అక్కడి ప్రజలు ప్రశ్నించేందుకు ఈ ఎజెండాను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదిక కన్వీనర్ రాఘవాచారి, మల్లయ్య, ప్రొఫెసర్ వనమాల, ఎ.రాజేంద్రబాబు, మోహన్‌సింగ్ పాల్గొన్నారు. -
ప్రజాసమస్యలే అజెండాగా వైఎస్ జగన్ పోరాటం
-
సర్కార్ వైఫల్యాలే అజెండాగా ప్లీనరీలు
సాక్షిప్రతినిధి, కాకినాడ : ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలపై చర్చ ప్రధాన అజెండాగా సాగుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్లీనరీలు పార్టీ శ్రేణులకు ఉత్తేజాని్నస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ¯ŒSమోహనరెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో గురువారం ప్రారంభమైన ప్లీనరీలు రెండో రోజు శుక్రవారం రామచంద్రపురం, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో జరిగాయి. కోఆరి్డనేటర్ ముత్తా శశిధర్ అధ్యక్షతన జరిగిన సిటీ ప్లీనరీకి పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటు కోఆరి్డనేటర్ చలమలశెట్టి సునీల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ సర్కార్ వైఫల్యాలను కార్యకర్తల సమక్షంలో చర్చించి ప్రభుత్వ తీరు ఎండగట్టేందుకు నియోజకవర్గ ప్లీనరీలు దిశానిర్దేశం చేస్తాయని వారు నొక్కి చెప్పారు. కాకినాడ సిటీ ప్లీనరీ సూర్యకళామందిరంలో జరుగగా నియోజకవర్గ కోఆరి్డనేటర్ ముత్తా శశిధర్, సిటీ ప్రెసిడెంట్ ఫ్రూటీకుమార్, కోఆరి్డనేటర్ ముత్యాల శ్రీనివాస్, తోట నాయుడు, మాజీ మంత్రులు కొప్పన మోహనరావు, ముత్తా గోపాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్ తదితరులు కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. రామచంద్రపురం లయ¯Œ్స కల్యాణమండపంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో 18 తీర్మానాలు ప్రవేశపెట్టారు. చంద్రబాబు ఉగ్గుపాలతో అవినీతిని నేర్పిస్తూ, ప్రోత్సహిస్తున్న తీరును గ్రామగ్రామాన ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్సీ బోస్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తదితరులు కేడర్‌కు సూచించారు. వర్థంతికి, జయంతికి తేడా తెలియకుండా మాట్లాడుతున్న లోకేశ్‌ను మంత్రి చేయడంతోనే బాబు నిజరూపం బయటపడిందని నేతలు ఆక్షేపించారు. ప్రతి కార్యకర్త టీడీపీ అక్రమాలను, వైఎస్సార్‌పై చేస్తోన్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని నేతలు కార్యకర్తలకు నూరిపోశారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టబ్బాయి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, కోఆరి్డనేటర్లు పర్వత ప్రసాద్, పితాని బాలకృష్ణ, ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, వేగుళ్ల లీలాకృష్ణ, వేగుళ్ల పట్టాభిరామయ్య, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వలవల బాబ్జీ, కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహనరావు, రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేడర్ పెద్ద ఎత్తున పాల్గొంది. -
గద్వాల జిల్లానే అజెండా
గద్వాల న్యూటౌన్ : రాజకీయ పార్టీల నాయకులు అన్ని జెండాలు, అజెండాలు పక్కన బెట్టి గద్వాల జిల్లానే ఏకైక అజెండాగా కలిసి ఉద్యమించాలని జేఏసీ నాయకులు వీరభద్రప్ప, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, రాజవర్ధన్‌రెడ్డి కోరారు. శనివారం స్థానిక టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయవచ్చని ప్రభుత్వమే చెప్పిందని, అయితే ఇక్కడి ప్రాంత ప్రజలు ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అవహేళన చేసేలా సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం దారుణమన్నారు. పార్టీలకతీతంగా కుల, ప్రజా, విద్యార్థి సంఘాలు కలిసి పోరాటం చేస్తుంటే రాజకీయ పోరాటమని కొట్టి పారేయడం తగదన్నారు. గద్వాల జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... ఆదివారం జూరాల ప్రాజెక్టుపై నల్లబ్యాడ్జీలతో మన జిల్లా–మన ప్రాజెక్టు పేరుతో చేపట్టే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. దీనికి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నాయకులు సుభాన్, గడ్డం కష్ణారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మున్నాభాషా మద్దతునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బీజాపూర్ ఆనంద్, బాలగోపాల్‌రెడ్డి, మోహన్‌రావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు సమస్యల సమరశీల పోరాటాలే ఎజెండా
–ఈనెల 29 నుంచి 31 వరకు కడపలో రాష్ట్రస్థాయి వర్కషాపు –ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి రామచంద్రయ్య కడప అగ్రికల్చర్ : రైతాంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలే ఎజెండాగా ముందుకు సాగాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. రామచంద్రయ్య పిలుపు నిచ్చారు. ఆదివారం కడప నగరంలోని ఎద్దుల ఈశ్వరరెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలక ప్రభుత్వాలు అధికారంలోకి రాక ముందు సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని గట్టెక్కిస్తామని, రైతులు తీసుకున్న రుణాలన్నింటిని మాఫీ చేస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పి అధికారం చేజిక్కించుకోగానే రుణమాఫీ మరచి కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేశారని పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు ఒరిగిందేమి లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి కొరవడిన కారణంగా రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని అన్నారు. అటు ప్రభుత్వం నుంచి పరిహారం అందక, మరో పక్క రుణమాఫీకాక, బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లించలేక అవమాన భారాలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధకరమన్నారు. రాయలసీమను ఉద్యాన హబ్‌గా మారుస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి చందరబాబునాయుడు అటు ఉద్యానశాఖకు నిధుల్లో కోతకోసి, సాగు నీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయించకుండా సాగు నీరు ఎలా ఇస్తారో, ఎలా హబ్‌గా మారుస్తారో రైతులకు సమాధానం చెప్పాలన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూలంకషంగా చర్చించడానికి ఈనెల 29 నుంచి 31 కడపలో రాష్ట్రస్థాయి వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామసుబ్బారెడ్డి, చంద్ర, కార్యనిర్వహక అధ్యక్షులు ఏవి రమణ, రైతు సంఘం నాయకులు రాహుల్, బాలచంద్రయ్య, మల్లిఖార్జునరెడ్డి, రామలింగారెడ్డి, చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.