న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్రం నిర్వహించనున్న భేటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమావేశంలో చర్చించే ప్రధాన అజెండా నుంచి ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ తాజాగా తొలగించింది. అజెండాలో మార్పులు చేస్తూ తాజాగా మరో సర్య్కూలర్ జారీ చేసింది. రాజకీయంగా చర్చనీయాంశమైన ప్రత్యేక హోదాను అజెండా నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. త్రిసభ్య కమిటీలో చర్చించాల్సిన 9 అంశాల నుంచి అయిదు అంశాలకే పరిమితం చేసింది.
తొలుత ప్రత్యేక హోదా, వెనకబడిన జిల్లాలకు నిధులు సహా తొమ్మిది అంశాలను అజెండాలో పేర్కొన్న కేంద్ర హోంశాఖ.. ఆ తర్వాత ప్రత్యేక హోదాను తొలగించింది. ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు, వెనకబడిన జిల్లాలకు నిధులు, వనరుల సర్దుబాటు అంశాలను తొలగిస్తున్నట్లు సర్క్యూలర్ జారీ చేసింది. కాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈనెల 17న కీలక సమావేశం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్‌ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉన్నారు.
శనివారం ఉదయం త్రిసభ్య కమిటీ ఎజెండాలో పేర్కొన్న 9 అంశాలు...
ఎజెండా1: ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
ఎజెండా 2: ఏపీ- తెలంగాణ మధ్య విద్యుత్ వినియోగ సమస్యపై పరిష్కారం
ఎజెండా 3: పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం
ఎజెండా 4: రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు
ఎజెండా 5: ఏపీఎస్‌సీఎస్‌సీఎల్, టీఎస్‌సీఎస్‌సీఎల్ మధ్య నగదు ఖాతాల విభజన
ఎజెండా 6: ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ
ఎజెండా 7: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జాల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు
ఎజెండా 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
ఎజెండా 9: రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు ...
► ఇందులో మొదటి అయిదు అంశాలను అలాగే ఉంచి.. చివరి నాలుగు అంశాలను కేంద్ర హోంశాఖ తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment