central home minister
-
అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధించిన మమతా
న్యూఢిల్లీ: లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రెవేశ పెట్టిన సమయంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మీ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించమని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మోదీనే అధికారంలోకి వస్తారని అన్నారు. అమిత్ షా వ్యాఖలపై స్పందిస్తూ.. అమిత్ షా చెప్పింది కరెక్టే వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో INDIA కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీలో అధికారాలపై పట్టు కోసం ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం ఎలాగైనా పార్లమెంటులో బిల్లును ఆమోదింప చేసుకోవాలన్న మొండి పట్టుదలతో ఉంది. ఈ నేపధ్యంలో గురువారం బిల్లును ప్రవేశ పెడుతూ అమిత్ షా ప్రతిపక్ష INDIA కూటమిని టర్గెట్ చేసి.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే.. మీరంతా కొత్తగా ఏర్పడిన మీ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించమంటూ వ్యాఖ్యలు చేశారు. సమావేశాల అనంతరం విపక్ష కూటమిలో ప్రధాన సభ్యురాలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విలేఖరుల సమావేశంలో అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ అమిత్ షా చెప్పింది వాస్తవం. ఢిల్లీలోనే పార్లమెంటు ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికారం INDIA కూటమిదే. మాతృభూమిని కాపాడుకోవడం కోసమే INDIA కూటమి ఏర్పడిందన్నారు. NDA బలహీనమైందని అందులోని వారంతా కూటమిని విడిచిపెట్టి ఎప్పుడో వెళ్లిపోయారని అన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగి దేశం మరింత దయనీయ స్థితికి చేరకుండా, మతపరమైన విద్వేషాలు చెలరేగకుండా ఉండాలంటే మా కూటమి అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. వారు దేశమంతా కాషాయమయం చేసేస్తామంటున్నారు. మాకు కూడా కాషాయమంటే ఇష్టమే... కానీ మిగతా రంగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ‘మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి’ -
మణిపూర్ అల్లర్లు: అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన అమిత్ షా
న్యూఢిల్లీ: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఎట్టకేలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈశాన్య రాష్ట్రంలో నెలన్నరగా జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తెచ్చి రాష్ట్రంలో శాంతిస్థాపనే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది హోంశాఖ. ప్రశాంతతకు నెలవైన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మే 3న ఒక్కసారిగా భగ్గుమంది. ఇక్కడి జనాభాలో అత్యధికులు మెయిటీ, కుకీ తేగల మధ్య వైరం తారాస్థాయిలో రాజుకుంది. రెండు వర్గాలు పరస్పర దాడులు చేసుకుంటూ సృష్టించిన బీభత్సంలో అనేకమంది సామాన్యుల జీవితాలు చితికిపోయాయి. ఈ అల్లర్ల కారణంగా 98 మంది మృతిచెందగా భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. దీంతో ఉలిక్కిపడిన కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సాయంతో సైనిక బలగాలను, పోలీసులను మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పర్యటించి, రెండు వర్గాల మధ్య సంధిని కుదిర్చి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి సద్దుమణిగిందనుకుంటున్నంతలోనే మళ్ళీ నిప్పు రాజుకుంది. మరోసారి అల్లర్లు చెలరేగడంతో 9 మంది స్థానిక ఎమ్మెల్యేలు బైరెన్ సింగ్ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదని తేల్చి చెప్పేశారు. ఈ మేరకు ప్రధానమంత్రికి ఒక లేఖను రాస్తూ.. ఇక్కడి ప్రజల నమ్మకాన్ని చూరగొనాలంటే మొదట ప్రభుత్వం చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని, పరిపాలనా విధానంలో మార్పులు చేయాలని వారు తెలిపారు. ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మెయిటీ తెగకు చెందినవారే. దీంతో కేంద్ర హోంశాఖకు అన్నివైపుల నుండి ఒత్తిడి అధికమవడంతో ఆలస్యం చేయకుండా మణిపూర్‌లో శాంతిస్థాపనే ప్రధాన ఉద్దేశ్యంగా అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశం జూన్ 24న న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుందని ఈ ప్రకటనలో తెలిపింది హోంశాఖ. Union Home Minister Shri @AmitShah has convened an all party meeting on 24th June at 3 PM in New Delhi to discuss the situation in Manipur.@PIB_India @DDNewslive @airnewsalerts — Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) June 21, 2023 ఇది కూడా చదవండి: భారత ప్రధానిపై హాలీవుడ్ నటుడి ప్రశంసలు -
ద్రవరూప డీఏపీ, యూరియా వాడండి
న్యూఢిల్లీ: రైతులు సాగులో ద్రవరూప నానో డీఏపీ, యూరియాను వినియోగించాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా సూచించారు. ఈ ఉత్పత్తులను విరివిగా ఉపయోగించడం ద్వారా ఎరువుల తయారీలో దేశాన్ని స్వావలంబన భారత్‌గా మార్చాలని రైతులకు పిలుపునిచ్చారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. ఇఫ్కో నానో (ద్రవరూప) డీఏపీ వాణిజ్య విక్రయాలను మంత్రి బుధవారం ఢిల్లీలో ప్రారంభించి, మాట్లాడారు. ఇఫ్కో ద్రవరూప నానో డీఏపీ 500 ఎంఎల్ బాటిల్‌ను రూ.600కు విక్రయించనున్నారు. అదే సంప్రదాయ 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,350గా ఉంది. సాగులో ద్రవరూప ఉత్పత్తులను వినియోగించడం వల్ల నాణ్యతతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని మంత్రి అమిత్‌షా అన్నారు. భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. ద్రవరూప డీఏపీతో సాగు ఖర్చులు 6 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గుతాయని చెప్పారు. అలాగే ద్రవరూప ఎరువుల రవాణా, నిల్వ కూడా సులభం. ద్రవరూప ఎరువులు భారత్‌ను స్వావలంబన దిశగా నడిపిస్తాయన్నారు. 2021–22లో 91.36 లక్షల టన్నుల యూరియా, 54.62 లక్షల టన్నుల డీఏపీ, 24.60 లక్షల టన్నుల ఎంవోపీ, 11.70 లక్షల టన్నుల ఎన్పీకే ఎరువులను దిగుమతి చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇఫ్కో తయారు చేసిన నానో డీఏపీకి 20 ఏళ్ల కాలానికి పేటెంట్ వచ్చినట్టు మంత్రి అమిత్‌షా తెలిపారు. -
28న రాష్ట్రానికి అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధినాయకత్వం ‘మిషన్ తెలంగాణ’ను టాప్‌గేర్‌లోకి తీసుకెళ్లనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న చిరకాల కోరికను సాధించేందుకు దృష్టి కేంద్రీకరిస్తోంది. అలాగే, రాష్ట్రంలో మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 19న ప్రధాని మోదీ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని, వైఫల్యాలను ఎండగట్టనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనికి కొనసాగింపుగా ఈ నెల 28న పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపార్టీ సంస్థాగతంగా ఏ మేరకు ఎన్నికలకు సన్నద్ధమైందో పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బూత్ కమిటీలు, మండల, ఇతరస్థాయిల కమిటీల నియామకం తదితర విషయాలపై సమీక్షిస్తారు. అవసరమైతే అమిత్‌షా 29వ తేదీ కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నాలుగేసి లోక్‌సభ నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్‌గా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. అమిత్‌షా కనీసం రెండు క్లస్టర్ సమావేశాల్లో పాల్గొని సంస్థాగతంగా ఎన్నికల సన్నద్ధతను పర్యవేక్షించనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కసరత్తు షురూ వచ్చే డిసెంబర్‌లోగా ఎప్పుడైనా ఎన్నికలు ఉండొచ్చనే అంచనాల మధ్య బీజేపీ కసరత్తును ముమ్మరం చేసింది. ఎన్నికల సన్నద్ధతపై తాజాగా ఆరెస్సెస్ జాతీయ నాయకత్వం నుంచి బీజేపీ జాతీయ, రాష్ట్రనాయకత్వాలు సలహాలు తీసుకున్నాయి. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను తీవ్రస్థాయిలో ఎండగట్టడంతోపాటు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరింత సమన్వయంతో పనిచేయాలని ఆరెస్సెస్ సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పారీ్టకి సంబంధించిన వివిధస్థాయిల నాయకులు, లోక్‌సభ నియోజకవర్గస్థాయి కమిటీలకు బుధ, గురువారాల్లో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్రపార్టీ సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేయనున్నారు. వివిధ వర్గాల ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వతీరును, ముఖ్యమైన హామీలను నిలబెట్టుకోకపోవడాన్ని ఎండగట్టేలా భవిష్యత్ కార్యాచరణకు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతోపాటు సంస్థాగతంగా పార్టీ పటిష్టత, పోలింగ్ బూత్ స్థాయి వరకు వివిధ కమిటీల బలోపేతం, ప్రజాసమస్యల పరిష్కారం తదితర అంశాలపై దృష్టి పెట్టనున్నారు. అలాగే, బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగే పార్లమెంటు ప్రభారీ, విస్తారక్ సమావేశంలోనూ బన్సల్ పాల్గొంటారని రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ప్రభారీలు, కన్వీనర్ల నియామకం రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్లమెంటరీ ప్రభారీలు, కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లుగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నియమించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు వీరు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పనిచేయాల్సి ఉంటుంది. నడ్డా సమక్షంలో పొంగులేటి చేరిక ఫిబ్రవరి తొలి వారంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరనున్నట్టు పారీ్టవర్గాల సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్యనేతల సమక్షంలో ఆయన బీజేపీలో అధికారికంగా చేరేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నాయకత్వంపై నేరుగా విమర్శలు గుప్పించడం, వచ్చే ఎన్నికల్లో తానే కాదు తన అనుయాయులంతా పోటీచేస్తారంటూ తాజాగా పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 18న ఢిల్లీలో అమిత్‌షా, జేపీ నడ్డా ఇతర ముఖ్యనేతలను పొంగులేటి కలుసుకుంటారని చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారపారీ్టతోపాటు అన్ని పారీ్టల నాయకులు, కార్యకర్తలతో పొంగులేటికి సత్సంబంధాలు ఉన్నందున ఆయన చేరికతో బీజేపీ పూర్తిస్థాయిలో బలం పుంజుకుని మెజారిటీ సీట్లలో గెలుపొందుతుందనే విశ్వాసాన్ని బీజేపీ ముఖ్యనేతలు వ్యక్తంచేస్తున్నారు. -
‘కమ్యూనిస్టులు కూడా కనుమరుగు.. భవిష్యత్తు బీజేపీదే’
తిరువనంతపురం: భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేరళ రాజధాని తిరువనంతపురంలో నిర్వహించిన దక్షిణాది జోనల్ కౌన్సిల్ మీటింగ్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తు బీజేపీ పార్టీనేనని పేర్కొన్నారు. అలాగే.. ప్రపంచం నుంచే కమ్యూనిస్ట్ పార్టీలు కనుమరుగవుతున్నట్లు చెప్పారు. ‘భారత్ నుంచి కాంగ్రెస్ అంతరించిపోతోంది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ సైతం ప్రపంచం నుంచే కనుమరుగవుతోంది. కేరళలో ఒక్క బీజేపీ పార్టీకే భవిష్యత్తు.’ అని పేర్కొన్నారు అమిత్ షా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు అమిత్ షా. వెనకబడిన తరగతులు, మైనారిటీల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడూ పని చేయలేదని విమర్శించారు. వారిని కేవలం ఓటు బ్యాంకులాగే చూశారని దుయ్యబట్టారు. దేశం కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. అందుకే వారి పాలనలో భారతరత్న ఇవ్వలేదని ఆరోపించారు. ఇదీ చదవండి: ‘అదే జరిగితే 2024లో పిక్చర్ వేరేలా ఉంటుంది’.. బీజేపీపై నితీశ్ విమర్శలు -
Andhra Pradesh: ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించిన కేంద్రం
-
ఏపీకి ప్రత్యేక హోదా.. అజెండా నుంచి తొలగించిన కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్రం నిర్వహించనున్న భేటీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమావేశంలో చర్చించే ప్రధాన అజెండా నుంచి ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ తాజాగా తొలగించింది. అజెండాలో మార్పులు చేస్తూ తాజాగా మరో సర్య్కూలర్ జారీ చేసింది. రాజకీయంగా చర్చనీయాంశమైన ప్రత్యేక హోదాను అజెండా నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. త్రిసభ్య కమిటీలో చర్చించాల్సిన 9 అంశాల నుంచి అయిదు అంశాలకే పరిమితం చేసింది. తొలుత ప్రత్యేక హోదా, వెనకబడిన జిల్లాలకు నిధులు సహా తొమ్మిది అంశాలను అజెండాలో పేర్కొన్న కేంద్ర హోంశాఖ.. ఆ తర్వాత ప్రత్యేక హోదాను తొలగించింది. ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు, వెనకబడిన జిల్లాలకు నిధులు, వనరుల సర్దుబాటు అంశాలను తొలగిస్తున్నట్లు సర్క్యూలర్ జారీ చేసింది. కాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈనెల 17న కీలక సమావేశం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉన్నారు. శనివారం ఉదయం త్రిసభ్య కమిటీ ఎజెండాలో పేర్కొన్న 9 అంశాలు... ఎజెండా1: ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన ఎజెండా 2: ఏపీ- తెలంగాణ మధ్య విద్యుత్ వినియోగ సమస్యపై పరిష్కారం ఎజెండా 3: పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం ఎజెండా 4: రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు ఎజెండా 5: ఏపీఎస్సీఎస్సీఎల్, టీఎస్సీఎస్సీఎల్ మధ్య నగదు ఖాతాల విభజన ఎజెండా 6: ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ ఎజెండా 7: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జాల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు ఎజెండా 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎజెండా 9: రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు ... ► ఇందులో మొదటి అయిదు అంశాలను అలాగే ఉంచి.. చివరి నాలుగు అంశాలను కేంద్ర హోంశాఖ తొలగించింది. -
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పలు సూచనలు చేస్తూ శనివారం లేఖ రాశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి సడలింపులు ఇవ్వాలని తెలిపారు. టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్ నియమాలను పాటించాలని సూచించారు. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టమ్‌ను విచ్ఛిన్నం చేయడం కీలకం అని లేఖలో తెలిపారు. రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని.. పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు పునఃప్రారంభించాలని సూచించారు. చదవండి: Covid Vaccine: వ్యాక్సిన్ల సేకరణ ఎలా? -
నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌ని...
‘‘సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తునకు ఆదేశించాలి’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సోషల్ మీడియా వేదికగా కోరారు బాలీవుడ్ నటి రియా చక్రవర్తి. గత నెల 14న సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ‘‘గౌరవనీయులైన అమిత్ షాగారికి.. నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి. సుశాంత్ మనందరికీ దూరమై నెలరోజులు గడిచిపోయాయి. ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయాన్ని విశ్వసిస్తాను. సుశాంత్ మృతిపై సీబీఐ పరిశోధన జరిపించాలని నేను మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు ఎటువంటి కారణాలు ప్రేరేపించాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సత్యమేవ జయతే’’ అని పేర్కొన్నారు రియా. సుశాంత్ మరణంపై సీబీఐ పరిశోధన జరిపాలని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, కొంతమంది సినీవాసులు డిమాండ్ చేశారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి రియా ఓ కారణం అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారు . వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు సోషల్ మీడియా వేదికగా రియా ఫిర్యాదు చేశారు. -
'బడ్జెట్లో పెట్టకుండా లక్ష ఇళ్లు ఎలా కడతారు'
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు మండిపడ్డారు. బుధవారం తెలంగాణ బీజేపీ నేతలు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. గవర్నర్ వైఖరిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించామని నేతలు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల లిస్టులో అధికారపార్టీ భారీ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. బడ్జెట్లో పెట్టకుండా హైదరాబాద్‌లో లక్షల ఇళ్లు ఎలా కట్టిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు మాయమాటలు చెబుతున్నారని నేతలు ఆరోపించారు. బీజేపీ అగ్రనేతలను కలిసిన వారిలో బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి ఉన్నారు. -
జోనల్ కౌన్సిల్ భేటీ లో ’రాజ్‌నాథ’
-
రాజ్‌నాథ్ అధ్యక్షతన జోనల్ కౌన్సిల్ భేటీ
విజయవాడ : దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ 26వ సమావేశం శనివారం విజయవాడలో ప్రారంభమైంది. నగరంలోని గేట్ వే హోటల్లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శనివారం ఈ బేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి లెఫ్టనెంట్ గవర్నర్ హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తప్ప ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఎవరూ ఈ సమావేశానికి హాజరుకాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న... అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు... అలాగే రాష్ట్రాల కోసం చేపట్టవలసిన ప్రణాళికలు, మౌలిక సదుపాయాలు, శాంతి భద్రతలు, నక్సల్స్ ప్రభావంతోపాటు సామాజిక అంశాలు, సరిహద్దు వివాదాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. -
పెద్దల భద్రతకు గట్టి చర్యలు!
న్యూఢిల్లీ: వయో వృద్ధుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వారి రక్షణకు సం బంధించి పోలీసింగ్ ఏర్పాట్లపై అత్యవసరంగా సమీక్షించి లోపాలను నివారించాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ పలు సూచనలు చేసింది. ఒంటరిగా నివసిస్తున్న వయో వృద్ధుల సమాచారం, నేరాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి వారికి తగిన సూచనలు చేయాలని కోరింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పోలీస్ స్టేషన్ వయో వృద్ధుల భద్రతకు చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు సమీక్షించేలా పోలీస్ ప్రధాన కార్యాలయం చర్యలు చేపట్టాలని తెలిపింది. రాత్రి, పగటి పూట కూడా పెట్రోలింగ్ నిర్వహించాలని మార్గదర్శకాల్లో సూచించింది. ధనవంతులైన వయో వృద్ధుల భద్రత పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, వారి ఇళ్లలో పనిచేసే పనిమనుషులు, సిబ్బంది వివరాలను సేకరించాలని పేర్కొంది. కొద్ది దశాబ్దాలుగా ఉమ్మడి కుటుంబాల సం ఖ్య తగ్గటం, పిల్లలు ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటం, సంతానం లేకపోవటం తదితర అంశాల వల్ల ఒంటరిగా నివసించే వృద్ధుల సంఖ్య పెరుగుతున్నందున సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు వ్యవహరించాలని సూచించింది. ‘వయో వృద్ధుల వివరాల రికార్డులను పోలీస్ ఉన్నతాధికారులు తరచుగా సమీక్షిస్తుండాలి. వారి నివాస ప్రాంతాల్లో గస్తీ పెంచాలి. సీనియర్ సిటిజన్ల భద్రత పర్యవేక్షణకు పోలీస్‌శాఖ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలి. నిరంతరం పనిచేసేలా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి’ అని మార్గదర్శకాల్లో పేర్కొంది. -
కేంద్ర మంత్రి షిండేపై విలాస్ మండిపాటు
నాగపూర్: ప్రత్యేక విదర్భ విషయంలో దేశ ప్రజలను కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే పక్కదారి పట్టిస్తున్నారని స్థానిక ఎంపీ విలాస్ ముత్తెం వార్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ లేఖ రాశారు. ‘పాతదైనందువల్లనే తెలంగాణ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని మీరు పేర్కొన్నారు. విదర్భ కంటే అత్యంత అర్హత కలిగినదని చెప్పారు. విదర్భ చారిత్రక వాస్తవాలు లేని దన్నారు. అందుకు సాక్ష్యాలేమీ లేవన్నారు. ఈ వ్యాఖ్యలు విదర్భ ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయి. ‘మీ శాఖ అధికారులు మి మ్మల్ని మభ్యపెడుతున్నారా లేదా గట్టి పత్రసహిత ఆధారాలున్నప్పటికీ మీరు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారా’ అని ప్రశ్నించారు. విదర్భ అం శం అత్యంత పాతదన్నారు. 1953లో ఏర్పాటైన ఫజల్ అలీ కమిషన్ సైతం విదర్భను ప్రతే ్యక రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చంటూ సమర్థించిందన్నారు. విదర్భకు మంచి రాబడి ఉందని పేర్కొందన్నారు. అం దువల్ల మహారాష్ట్రలోనే ఉండాలంటూ ఒత్తిడి తీసుకురాకూడదని సూచించిందన్నారు. ‘అనేక సంవత్సరాలుగా వివిధ కీలక మంత్రి పదవులను మీరు నిర్వహించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయినప్పటికీ వెనుకబడిన విదర్భకు మీరు చేసేందేమీ లేదు. ప్రస్తుతం మీరు అత్యంత ప్రభావవంతమైన పదవిలో ఉన్నారు. విదర్భ ప్రాంత అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాల్సింది పోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లలేదు’ అని అన్నారు. -
కేంద్ర మంత్రి షిండేపై విలాస్ మండిపాటు
నాగపూర్: ప్రత్యేక విదర్భ విషయంలో దేశ ప్రజలను కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే పక్కదారి పట్టిస్తున్నారని స్థానిక ఎంపీ విలాస్ ముత్తెం వార్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ లేఖ రాశారు. ‘పాతదైనందువల్లనే తెలంగాణ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని మీరు పేర్కొన్నారు. విదర్భ కంటే అత్యంత అర్హత కలిగినదని చెప్పారు. విదర్భ చారిత్రక వాస్తవాలు లేని దన్నారు. అందుకు సాక్ష్యాలేమీ లేవన్నారు. ఈ వ్యాఖ్యలు విదర్భ ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయి. ‘మీ శాఖ అధికారులు మి మ్మల్ని మభ్యపెడుతున్నారా లేదా గట్టి పత్రసహిత ఆధారాలున్నప్పటికీ మీరు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారా’ అని ప్రశ్నించారు. విదర్భ అం శం అత్యంత పాతదన్నారు. 1953లో ఏర్పాటైన ఫజల్ అలీ కమిషన్ సైతం విదర్భను ప్రతే ్యక రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చంటూ సమర్థించిందన్నారు. విదర్భకు మంచి రాబడి ఉందని పేర్కొందన్నారు. అం దువల్ల మహారాష్ట్రలోనే ఉండాలంటూ ఒత్తిడి తీసుకురాకూడదని సూచించిందన్నారు. ‘అనేక సంవత్సరాలుగా వివిధ కీలక మంత్రి పదవులను మీరు నిర్వహించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయినప్పటికీ వెనుకబడిన విదర్భకు మీరు చేసేందేమీ లేదు. ప్రస్తుతం మీరు అత్యంత ప్రభావవంతమైన పదవిలో ఉన్నారు. విదర్భ ప్రాంత అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాల్సింది పోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లలేదు’ అని అన్నారు.