'బడ్జెట్లో పెట్టకుండా లక్ష ఇళ్లు ఎలా కడతారు' | telangana bjp leaders meets central home minister | Sakshi
Sakshi News home page

'బడ్జెట్లో పెట్టకుండా లక్ష ఇళ్లు ఎలా కడతారు'

Published Wed, Dec 16 2015 7:54 PM | Last Updated on Sat, Aug 11 2018 7:03 PM

'బడ్జెట్లో పెట్టకుండా లక్ష ఇళ్లు ఎలా కడతారు' - Sakshi

'బడ్జెట్లో పెట్టకుండా లక్ష ఇళ్లు ఎలా కడతారు'

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు మండిపడ్డారు. బుధవారం తెలంగాణ బీజేపీ నేతలు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు.

రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ తలసానితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. గవర్నర్ వైఖరిపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు వివరించామని నేతలు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల లిస్టులో అధికారపార్టీ భారీ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. బడ్జెట్లో పెట్టకుండా హైదరాబాద్లో లక్షల ఇళ్లు ఎలా కట్టిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు మాయమాటలు చెబుతున్నారని నేతలు ఆరోపించారు. బీజేపీ అగ్రనేతలను కలిసిన వారిలో బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement