రాజ్నాథ్ అధ్యక్షతన జోనల్ కౌన్సిల్ భేటీ | South zonal council meeting starts at vijayawada | Sakshi
Sakshi News home page

రాజ్నాథ్ అధ్యక్షతన జోనల్ కౌన్సిల్ భేటీ

Published Sat, Dec 12 2015 11:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

South zonal council meeting starts at vijayawada

విజయవాడ : దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ 26వ సమావేశం శనివారం విజయవాడలో ప్రారంభమైంది. నగరంలోని గేట్ వే హోటల్లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన శనివారం ఈ బేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. 

తెలంగాణ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి లెఫ్టనెంట్ గవర్నర్ హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తప్ప ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఎవరూ ఈ సమావేశానికి హాజరుకాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న... అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు... అలాగే రాష్ట్రాల కోసం చేపట్టవలసిన ప్రణాళికలు, మౌలిక సదుపాయాలు, శాంతి భద్రతలు, నక్సల్స్ ప్రభావంతోపాటు సామాజిక అంశాలు, సరిహద్దు వివాదాలపై  ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement