Manipur governor
-
మణిపూర్ గవర్నర్‌గా ఏకే భల్లా
సాక్షి, న్యూఢిల్లీ: కల్లోలిత మణిపూర్ సహా ఐదు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాను ఆమె ఆమోదించారు. దాదాపు రెండేళ్లుగా జాతుల మధ్య వైరంతో అట్టుకుతున్న మణిపూర్‌కు గవర్నర్‌గా కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అయిన భల్లా అస్సాం, మేఘాలయ కేడర్ అధికారి.అదేవిధంగా, మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబుకు ఒడిశా గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో మిజోరం గవర్నర్‌గా ఆర్మీ మాజీ చీఫ్ విజయ్‌కుమార్ సింగ్‌ను నియమించారు. బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళ గవర్నర్‌గా... కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను బిహార్ గవర్నర్‌గా నియమించారు. వీరు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ తెలిపింది. -
Manipur violence: హింస నివారణలో ప్రభుత్వం విఫలం
ఇంఫాల్: మణిపూర్‌లో జాతి వైషమ్యాలను అదుపుచేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఆరోపించింది. మణిపూర్ సమస్యను పరిష్కరించడంలో ప్రధాని మోదీ తీవ్ర ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారని పేర్కొంది. సత్వరమే పరిష్కరించకుంటే దేశ భద్రతకు సైతం సమస్యగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు ఈ మేరకు ఆదివారం రాష్ట్ర మహిళా గవర్నర్ అనసూయ ఉయికేకు ఇచి్చన వినతి పత్రంలో పేర్కొన్నారు. వారు శని,ఆదివారాల్లో మణిపూర్‌లో సుడిగాలి పర్యటన చేశారు. బాధిత ప్రజలకు తక్షణమే పునరావాసం కలి్పంచాలని, రాష్ట్రంలో శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా కాల్పులు, గృహ దహన ఘటనలు కొనసాగుతుండటాన్ని బట్టి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. గడిచిన మూడు నెలలుగా రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతుండటంతో వదంతులు వ్యాప్తి చెంది జాతుల మధ్య విభేదాలు మరింతగా పెరిగాయన్నారు. జాతుల మధ్య పెరిగిన వైషమ్యాలను తక్షణమే చల్లార్చాల్సిన అవసరముందన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో తక్షణమే సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని గవర్నర్‌కు విపక్ష ఎంపీలు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో బయోమెట్రిక్ సర్వే 2021 సంవత్సరంలో మయన్మార్ దేశంలో సైనిక జుంటా అధికారంలోకి వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్లోకి పెరిగిన వలసలపై కేంద్రం అప్రమత్తమైంది. అక్రమంగా ప్రవేశించిన మయన్మార్ దేశస్తులను గుర్తించేందుకు బయోమెట్రిక్ సర్వే చేపట్టాలంటూ కేంద్రప్రభుత్వం ఇటీవల మణిపూర్, మిజోరం రాష్ట్రాలను ఆదేశించింది. మిజోరంలోని మొత్తం 11 జిల్లాల్లో కలిపి 30 వేల మందికిపైగా మయన్మార్ దేశస్తులున్నట్లు అంచనా. కేంద్రం నుంచి అందిన ఆదేశాల మేరకు ప్రస్తుతం సహాయక శిబిరాల్లో సర్వే చేపట్టినట్లు మిజోరం ముఖ్యమంత్రి లాల్ థంగ్లియానా ఆదివారం చెప్పారు. సెపె్టంబర్ 30వ తేదీలోగా మయన్మార్ దేశస్తుల నమోదు పూర్తి చేయాలని కేంద్ర హోం శాఖ కోరిందన్నారు. తమ వర్గానికి చెందిన వారే అయినందున తిరిగి మయన్మార్ పంపించలేక వారికి మానవతాదృక్పథంలో ఆశ్రయం కలి్పస్తున్నట్లు తెలిపారు. కొందరు బంధువుల వద్ద, అద్దె ఇళ్లలో ఉంటుండగా ఎక్కువ మంది సహాయ శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారని చెప్పారు. -
మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించండి
ఇంఫాల్: సమాజంలో నెలకొన్న సమస్యలకు, వివాదాలకు హింసాకాండ ఎంతమాత్రం పరిష్కార మార్గం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తేలి్చచెప్పారు. మణిపూర్‌లో తక్షణమే శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్ శుక్రవారం మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఘర్షణకు తెరదించి, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మణిపూర్ ప్రజల దుఃఖాన్ని పంచుకోవడానికి తాను ఇక్కడికి వచ్చానని రాహుల్ చెప్పారు. రాహుల్ శుక్రవారం ప్రజా సంఘాల సభ్యులతో సమావేశమై తాజా పరిస్థితిపై వారితో చర్చించారు. పదవి నుంచి తప్పుకోను..: బిరేన్ సింగ్ మణిపూర్‌లో జాతుల మధ్య ఎడతెగని ఘర్షణల నేపథ్యంలో సీఎం రాజీనామా చేశారంటూ వస్తున్న వదంతులకు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ చెక్‌పెట్టారు. పదవి నుంచి వైదొలగడం లేదని స్పష్టతనిచ్చారు. శుక్రవారం రాజ్‌భవన్ వైపు వెళ్తున్న సీఎం కాన్వాయ్‌ను పెద్దసంఖ్యలో ప్రజలు అడ్డగించారు. ఈ సందర్భంగా ఆయన.. సీఎం పదవికి రాజీనామా చేయడం లేదని ప్రకటించారు. ఇలా ఉండగా, గురువారం కాంగ్పోక్పి జిల్లాలో ఆందోళనకారులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో గాయపడిన అయిదుగురిలో ఒకరు శుక్రవారం ఆస్పత్రిలో చనిపోయారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. -
మణిపూర్ గవర్నర్‌గా గణేశన్
న్యూఢిల్లీ: తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీనేత లా గణేశన్‌ను కేంద్రం మణిపూర్ గవర్నర్‌గా నియమించింది. ఈ నెల 10న గవర్నర్ నజ్మా హెప్తుల్లా పదవీ విరమణ పొందినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. గవర్నర్‌గా గణేశన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. ఆయన నియామకం పట్ల తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిలిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. గణేశన్ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. -
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 75 సంవత్సరాల వయసు రావడంతో కేంద్ర మంత్రి పదవి నుంచి ఇటీవలే తప్పుకొన్న సీనియర్ నాయకురాలు డాక్టర్ నజ్మాహెప్తుల్లాను మణిపూర్ గవర్నర్‌గా నియమించారు. ఆమె ఈ రాష్ట్రానికి 18వ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2015 సెప్టెంబర్ 30వ తేదీ నుంచి మణిపూర్ బాధ్యతలను కూడా మేఘాలయ గవర్నర్ వి. షణ్ముగనాథన్ చూస్తున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్ వచ్చారు. ఈ రాష్ట్రానికి వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆమెతో పాటు అసోం గవర్నర్‌గా బన్వారీలాల్ పురోహిత్, పంజాబ్ గవర్నర్‌గా వీపీ సింగ్ బద్నోర్లను నియమించారు. అలాగే, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ గా జగదీష్ ముఖిని నియమించారు. -
తొమ్మిదో వికెట్ కూడా పడింది!!
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వరుసగా తొమ్మిదో వికెట్ పడింది. అవును.. మరో గవర్నర్ రాజీనామా చేశారు. మణిపూర్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న వీకే దుగ్గల్ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. యూపీఏ హయాంలో ఉన్న గవర్నర్లంతా ఒకరి తర్వాత ఒకరుగా రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడటంతో.. ఇప్పటికి ఎనిమిది మంది గవర్నర్లు తమ పదవుల నుంచి స్వచ్ఛందంగానో, బలవంతంగానో తప్పుకోవాల్సి వచ్చింది. యూపీఏ గవర్నర్లు రాజీనామా చేయాలన్న సంకేతాలు వెలువడగానే ముందుగా బీఎల్ జోషి, శేఖర్ దత్, అశ్వనీకుమార్ రాజీనామాలు చేశారు. ఆ తర్వాత బీవీ వాంఛూ, ఎంకే నారాయణన్ అగస్టా వెస్ట్‌లాండ్ వ్యవహారంలో సీబీఐ ప్రశ్నించడంతో కలత చెంది పదవుల నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత తనను నాగాలాండ్‌కు బదిలీ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బి.పురుషోత్తమన్ తప్పుకొన్నారు. ఇలా వరుసపెట్టి రాజీనామాల పర్వం కొనసాగింది. చిట్టచివరగా రెండు రోజుల క్రితం కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ సైతం రాజీనామా చేశారు. ఇప్పుడు దుగ్గల్ వంతు వచ్చింది. -
మణిపూర్ గవర్నర్‌గా వీకే దుగ్గల్
న్యూఢిల్లీ: హోంశాఖ మాజీ కార్యదర్శి వీకే దుగ్గల్- మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనను ఈ పదవిలో నియమించారని రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 1968 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన దుగ్గల్ 2007లో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. 1996 నుంచి 2000 వరకు ఢిల్లీ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలో(ఎన్డీఏమ్ఏ)లో ప్రస్తుతం సభ్యుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ సమస్య పరిష్కరించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణా కమిటీలో సభ్యుడిగానూ ఆయన వ్యవహరించారు.