మణిపూర్‌ గవర్నర్‌గా ఏకే భల్లా | Former Home Secretary Ajay Bhalla named new Manipur Governor | Sakshi
Sakshi News home page

మణిపూర్‌ గవర్నర్‌గా హోం శాఖ మాజీ కార్యదర్శి ఏకే భల్లా

Published Wed, Dec 25 2024 5:11 AM | Last Updated on Wed, Dec 25 2024 7:32 AM

Former Home Secretary Ajay Bhalla named new Manipur Governor

ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు 

ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి ముర్ము 

సాక్షి, న్యూఢిల్లీ: కల్లోలిత మణిపూర్‌ సహా ఐదు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా, ఒడిశా గవర్నర్‌ రఘుబర్‌ దాస్‌ రాజీనామాను ఆమె ఆమోదించారు. దాదాపు రెండేళ్లుగా జాతుల మధ్య వైరంతో అట్టుకుతున్న మణిపూర్‌కు గవర్నర్‌గా కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లాను నియమించారు. 1984 బ్యాచ్‌ ఐఏఎస్‌ అయిన భల్లా అస్సాం, మేఘాలయ కేడర్‌ అధికారి.

అదేవిధంగా, మిజోరం గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబుకు ఒడిశా గవర్నర్‌ బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో మిజోరం గవర్నర్‌గా ఆర్మీ మాజీ చీఫ్‌ విజయ్‌కుమార్‌ సింగ్‌ను నియమించారు. బిహార్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను కేరళ గవర్నర్‌గా... కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను బిహార్‌ గవర్నర్‌గా నియమించారు. వీరు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్‌ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement