Ajay Bhalla
-
మణిపూర్ గవర్నర్‌గా ఏకే భల్లా
సాక్షి, న్యూఢిల్లీ: కల్లోలిత మణిపూర్ సహా ఐదు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాను ఆమె ఆమోదించారు. దాదాపు రెండేళ్లుగా జాతుల మధ్య వైరంతో అట్టుకుతున్న మణిపూర్‌కు గవర్నర్‌గా కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అయిన భల్లా అస్సాం, మేఘాలయ కేడర్ అధికారి.అదేవిధంగా, మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబుకు ఒడిశా గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో మిజోరం గవర్నర్‌గా ఆర్మీ మాజీ చీఫ్ విజయ్‌కుమార్ సింగ్‌ను నియమించారు. బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళ గవర్నర్‌గా... కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను బిహార్ గవర్నర్‌గా నియమించారు. వీరు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ తెలిపింది. -
13వ షెడ్యూల్‌పై ముగిసిన సమీక్షా సమావేశం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల అమలుకు సంబంధించి ఈరోజు(మంగళవారం)ఢిల్లీ వేదికగా జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన సమావేశంలో 13వ షెడ్యూల్లోని విద్యా సంస్తలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వ సీఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు శ్రీలక్ష్మి, ప్రేమ చంద్రరెడ్డి, ప్రేమ చంద్రరెడ్డి, ఎస్ఎస్ రావత్, యువరాజ్లు హాజరయ్యారు. -
మూడు బిల్లులపై పరిశీలన ప్రారంభం
న్యూఢిల్లీ: ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలి్చన మూడు బిల్లులపై పార్లమెంటరీ స్థాయీసంఘం గురువారం పరిశీలన ప్రారంభించింది. బీజేపీ ఎంపీ, మాజీ ఐపీఎస్ అధికారి బ్రిజ్‌లాల్ నేతృత్వంలో హోంశాఖ వ్యవహారాలపై ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఏర్పాటైంది. మూడు బిల్లులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పార్లమెంట్ సభ్యులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాలను లేవనెత్తారు. మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 348ను ఉల్లంఘించడమే అవుతుందని డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ ఆక్షేపించారు. తన అభ్యంతరాలు, డిమాండ్లపై మారన్ ఒక లేఖ సమర్పించారు. మారన్ డిమాండ్లకు పలువురు విపక్ష ఎంపీలు మద్దతు పలికారు. మూడు బిల్లులను బీజేపీ సభ్యులు స్వాగతించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు’ను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
పట్టాలు తప్పి పిచ్చి రాతలు!
► విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై పచ్చ పత్రికలు పట్టాలు తప్పాయి. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన అజెండాలో అసలు రైల్వే జోన్ అంశమే లేదు. అజెండాలో లేని అంశాన్ని చర్చించినట్లుగా, రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం తేల్చేసినట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడబలుక్కుని తప్పుడు రాతలు రాశాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లాలన్నది వాటి పన్నాగం. దీనిపై వైఎస్సార్సీపీపీ నేత విజయసాయిరెడ్డి దీటుగా స్పందించారు. రైల్వే జోన్ రాకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని, వస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతిని మాకు రాసిస్తారా? అని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ.. రైల్వే జోన్ కచ్చితంగా ఏర్పాటవుతుందన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని.. కొన్ని పత్రికలు సృష్టిస్తున్న వదంతులు నమ్మవద్దన్నారు. రైల్వే జోన్ రాకుంటే రాజీనామా చేస్తా సాక్షి, అమరావతి: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ నూటికి నూరు శాతం వచ్చి తీరుతుందని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ రైల్వేజోన్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అభూత కల్పనలతో అవాస్తవాలను ప్రచురించాయని ధ్వజమెత్తారు. విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం ప్రస్తావనకే రాలేదని వెల్లడించారు. రైల్వే జోన్ వస్తే రామోజీరావు, రాధాకృష్ణ వారి పత్రికలను మాకు అప్పగిస్తారా? అని సవాల్ చేశారు. ఒకవేళ రైల్వే జోన్ రాకుంటే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతూ కుల ప్రాతిపదికన ముందుకెళ్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి రాతలను ప్రజలెవరూ విశ్వసించరని చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తలు అవాస్తవం అని తేలితే రామోజీ, రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెబుతారా? అని నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ► విశాఖ కేంద్రంగా రాష్ట్రానికి రైల్వే జోన్ రావట్లేదని, అది కలగా మిగిలిపోతుందని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు బ్యానర్ కథనాలను ప్రచురించాయి. రైల్వే మంత్రిని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కలిసినప్పుడు అతి త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఆయన స్వయంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ► ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రైల్వే జోన్ రాదని ఊహల్లో బతుకుతూ వాటిని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. వారి పత్రికల్లో అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. కేంద్రం నిర్వహించిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం చర్చకు రాలేదని తేలితే వారిద్దరూ బహిరంగంగా క్షమాపణలు చెబుతారా? ► పునర్విభజన చట్టంలో రైల్వేజోన్‌కు సంబంధించి చాలా స్పష్టంగా ఉంది. రాజధాని ఎక్కడైతే ఉందో ఆ రాజధానిని కొవ్వూరు మీదుగా తెలంగాణ ప్రాంతాలతో కలిసే విధంగా రైల్వే లైన్ నిర్మించి హైదరాబాద్‌తో అనుసంధానించాలనే అంశంపై చర్చ జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రం వాటా సొమ్ము ఇవ్వాలనేది కేంద్ర ప్రతిపాదన. పునర్విభజన చట్టంలోనే చాలా స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి కొవ్వూరు మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు కనెక్ట్ చేయాలని, ఆ మొత్తం నిధులను కేంద్రమే భరించాలనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. దీనికి సంబంధించిన చర్చ వచ్చింది. అంతేకానీ విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించిన చర్చ జరగలేదు. ► విశాఖ రైల్వే జోన్ తప్పకుండా వస్తుంది. రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీపీ ఎన్నో పోరాటాలు చేసింది. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నూటికి నూరుశాతం విశాఖ రైల్వే జోన్ వచ్చి తీరుతుంది. రామోజీ, రాధాకృష్ణ అవాస్తవాలను ప్రచురిస్తూ కులాభిమానంతో స్థాయిని దిగజార్చుకోవద్దు. -
కొలిక్కిరాని ‘విభజన’ సమస్యలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలు మరోసారి కొలిక్కి రాలేదు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మంగళవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం పెద్దగా ఫలితమివ్వకుండానే ముగిసింది. వివిధ అంశాలపై 2 గంటలపాటు ఈ భేటీలో చర్చించగా రెండు రాష్ట్రాలు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. కేంద్ర హోంశాఖ జోక్యం వద్దు.. షెడ్యూల్–9లోని సంస్థల విభజనలో కేంద్ర హోంశాఖకు ఎలాంటి అధికార పరిధి లేదని పాడిపరిశ్రమల సంస్థ కేసులో హైకోర్టు తీర్పునిచ్చిందని సమావేశంలో తెలంగాణ గుర్తు చేసింది. షెడ్యూల్–9లో 91 సంస్థలుండగా 90 సంస్థల విభజనపై షీలా బిడే కమి టీ చేసిన సిఫారసులన్నింటినీ అంగీకరించాలని ఏపీ కోరింది. అయితే కేసులు తేలే వరకు నిర్ణయాలు తీసుకోరాదని తెలంగాణ స్పష్టం చేసింది. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (దిల్) ఆస్తుల విభజనకు షీలా బిడే కమిటీ సిఫారసులు చేసిందని తెలంగాణ తప్పుబట్టింది. ‘దిల్’భూములను తెలంగాణ స్వాదీనం చేసుకోవడాన్ని ఏపీ సవాల్ చేయగా హైకోర్టు స్టే విధించిందని గుర్తుచేసింది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూముల కేసు తేలాకే ఆ సంస్థను విభజించాలని తెలంగాణ స్పష్టం చేసింది. కోర్టు కేసులపై పరిశీలన జరపాలని కేంద్ర హోంశాఖను ఆ శాఖ కార్యదర్శి ఆదేశించారు. నగదు నిల్వల పంపకాలపై తెలంగాణ ఓకే.. ఏపీ ఉన్నత విద్యామండలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా షెడ్యూల్–10లోని సంస్థల నగదు నిల్వల పంపకాలను జనాభా దామాషా ప్రకారం జరపాలని కేంద్రం ఉత్తర్వులకు తెలంగాణ మద్దతు తెలిపింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టులో ఏపీ వేసిన కేసు పెండింగ్‌లో ఉందని గుర్తుచేసింది. ఈ ఉత్తర్వులపై పునఃసమీక్ష జరపాల్సిన అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. సింగరేణి సంస్థను విభజించాలని ఏపీ కోరగా అందుకు తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సింగరేణిలోని 51% వాటాను తమకు బదలాయిస్తూ విభజన చట్టంలో కేంద్రం నిబంధనలు పొందుపర్చిన విషయాన్ని తెలంగాణ గుర్తుచేసింది. సింగరేణి అనుబంధ సంస్థ ‘ఆప్మెల్’నే విభజించాల్సి ఉందని స్పష్టం చేసింది. బియ్యం సబ్సిడీల్లో తెలంగాణ వాటా బకాయిలను ఏపీ చెల్లిస్తే ఏపీ పౌరసరఫరాల సంస్థ విభజనకు ముందు తెలంగాణ తీసుకున్న రూ. 354 కోట్ల రుణాలను చెల్లించడానికి తెలంగాణ అంగీకరించింది. విభజన చట్టంలో పేర్కొనని 12 సంస్థలను విభజించాలని ఏపీ కోరగా తెలంగాణ వ్యతిరేకించింది. నగదు, బ్యాంకుల్లో నిల్వల విభజన విషయంలో ‘కాగ్’సహకారం తీసుకోవాలని ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. పన్నుల్లో తేడాల నిర్మూలనకు విభజన చట్ట సవరణ జరపాలని ఏపీ కోరగా తెలంగాణ వ్యతిరేకించింది. గిరిజన వర్సిటీ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పరిశీలించండి... తెలంగాణ విజ్ఞప్తులకు స్పందిస్తూ విభజన హామీలైన గిరిజన వర్సిటీ, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉన్నత విద్య, రైల్వే శాఖలకు కేంద్ర హోంశాఖ సూచించింది. వెనుబడిన జిల్లాల అభివృద్ధి నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ భేటీలో సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక, ఇంధన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సునీల్ శర్మ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
నవంబర్ 30 వరకు ఆంక్షలు పొడిగించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కోవిడ్ నియంత్రణ చర్యలను కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ముఖ్యంగా పండుగ సీజన్లో తగిన జాగ్రత్తలతో, సురక్షితంగా ప్రజలను బయటికి అనుమతించే మార్గదర్శకాలను అమలు చేయడం చాలా కీలకమని ఆయన చెప్పారు. దేశంలో రోజువారీ కేసులు, యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా వైరస్ వ్యాప్తి ఉందని, ఇది ప్రజారోగ్య సవాల్‌గా కొనసాగుతోందని భల్లా లేఖలో పేర్కొన్నారు. పండుగ సీజన్లో టెస్ట్–ట్రాక్–ట్రీట్–వ్యాక్సినేషన్, కోవిడ్ ప్రోటోకాల్స్‌కు కట్టుబడి ఉండటంపై నిరంతరం దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. -
ప్రజలు గుమికూడటాన్ని నివారించండి
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మార్గదర్శకాల అమలును మరో నెలపాటు, సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశం మొత్తమ్మీద కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతానికి స్థిరంగా ఉందని పేర్కొన్నారు. అందుకే, రానున్న పండగల సీజన్ సమయంలో ప్రజలు ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. అవసరమైతే స్థానికంగా ఆంక్షలను అమలు చేయాలని స్పష్టం చేశారు. జనసమ్మర్ధం ఉన్నచోట్ల కోవిడ్ ప్రొటోకాల్స్ అమలు చేయాలన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది కోవిడ్ టీకా వేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. -
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పదవీకాలం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పదవీకాలాన్ని పొడగించారు. ఈ ఏడాది ఆగస్టు 22 న అజయ్ భల్లా పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పొడగిస్తూ.. గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అసోం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన భల్లా, 22 ఆగస్టు, 2019 న హోం సెక్రటరీగా నియమితులయ్యారు. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా తర్వాత కేంద్ర హోం సెక్రటరీగా విధులు స్వీకరించిన భల్లా.. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో.. పార్లమెంట్లో సీఏఏ, జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు వంటి కీలక, వివాదాస్పద చట్టాలను ఆమోదించారు. అలాగే, భల్లా రామ మందిరం ట్రస్ట్, కోవిడ్ -19 నిర్వహణను పర్యవేక్షించారు. -
కరోనాపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను తాజాగా పొడిగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినా మరికొన్నాళ్లు ఈ మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు గైడ్‌లైన్స్‌ను మరికొన్నాళ్లు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31వ తేదీ వరకు మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కేసులు తగ్గుతున్నాయని ఆత్మ సంతృప్తి చెందవద్దని ఈ సందర్భంగా హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల, ఆర్ ఫ్యాక్టర్ అధికంగా ఉండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పండుగల నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలు కరోనా మార్గదర్శకాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. స్థానికంగా కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షల సడలింపులపై నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పంచ వ్యూహం సిద్ధం చేసింది. టెస్ట్.. ట్రాక్.. ట్రీట్.. టీకా.. కరోనాగా పేర్కొంది. మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు పంపారు. -
కరోనా పొంచి ఉన్నా నిర్లక్ష్యమేనా?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు, నిపుణులు పదేపదే సూచిస్తున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. హిల్ స్టేషన్లతో పాటు మార్కెట్లలో జనం విచ్చలవిడిగా సంచరిస్తున్నారని, నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించింది. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు కచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా బుధవారం ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రజా రవాణాలో కోవిడ్–19 ప్రోటోకాల్‌కు ఏమాత్రం కట్టుబడి ఉండడం లేదని, భారీ సంఖ్యలో జనాలు బహిరంగ ప్రదేశాలకు వస్తున్నారని, అక్కడ సామాజిక దూరం సైతం పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం కోవిడ్–19 రెండో వేవ్ ఇంకా ముగియలేదని, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాల్సిందేనని అజయ్ భల్లా సూచించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజా రవాణా, హిల్ స్టేషన్లలో కోవిడ్–19 నిబంధనల ఉల్లంఘన యథేచ్చగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత చర్యల వల్లే కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని, ఇది ఆందోళనకరమైన విషయమని భల్లా తెలిపారు. అన్ని ప్రదేశాల్లో కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలను పాటించని పక్షంలో కఠిన ఆంక్షలు విధించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించేవారిపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా ఆంక్షలను సడలించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు సూచించారు. -
జాగ్రత్తగా ‘అన్‌లాక్’ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి తగ్గడంతో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ ఆంక్షల ఎత్తివేత లేదా సడలింపుల బాట పట్టాయి. అయితే, కోవిడ్ తాజా పరిస్థితులను నిశితంగా గమనించాకే అప్రమత్తతతో ‘అన్‌లాక్’ ప్రక్రియను మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం శనివారం సూచించింది. ఆంక్షల సడలింపుల కారణంగా మార్కెట్లు, కొన్ని ప్రదేశాల్లో ప్రోటోకాల్‌ను గాలికొదిలేసి ప్రజలు గుమికూడుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. దీంతో అన్‌లాక్ అప్రమత్తతపై శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ట్రిపుల్ టి + వీ మంత్రం అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించడంతోపాటు, కరోనా టెస్టింగ్–ట్రాకింగ్, ట్రీట్మెంట్(కోవిడ్ చికిత్స), టీకాలు, నిరంతర అప్రమత్తత ఇలా ఐదు అత్యంత ఆవశ్యకమైన నియమావళిని రాష్ట్రాలు తప్పక కొనసాగించాలని లేఖలో అజయ్ భల్లా సూచించారు. ‘వ్యాక్సినేషన్‌ను మరింతగా పెంచాలి. కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గడంతో రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను ఎత్తేయడమో, సడలించడమో చేస్తున్నాయి. అన్‌లాక్‌కు అనుగుణంగానే క్షేత్ర స్థాయి పరిస్థితులు ఉన్నాయని నిర్ధారించుకున్నాకే ఆంక్షలపై నిర్ణయాలు తీసుకోండి. మరో వేవ్ రాకుండా ఉండాలంటే నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిందే’ అని భల్లా సూచించారు. సంక్రమణ రేటు, యాక్టివ్ కేసులపై నిఘా ‘ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య ఏమాత్రం తగ్గడానికి వీల్లేదు. దేశంలో థర్డ్ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదలగానీ పాజిటివిటీ రేటులో పెరుగుదల వంటి సంకేతాలను ప్రారంభదశలో గుర్తించాలి. ఏదైనా ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఎక్కువైతే ఆ ప్రాంతానికే వ్యాప్తిని పరిమితం చేయాలి’ అని భల్లా లేఖలో పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌తో సురక్షితం కరోనా వైరస్ కట్టడికి టీకా అతిపెద్ద ఆయుధమని కేంద్రం తెలిపింది. కరోనా గొలుసు సంక్రమణలను విచ్ఛిన్నం చేయడానికి ఇది సహాయపడుతుందని, ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయాలని సూచించింది. రాష్ట్రాలు ఆంక్షలను సడలించుకోవచ్చని, అయితే కరోనా నిబంధనలను నిర్లక్ష్యంచేయొద్దని కోరింది. డాక్టర్లపై దాడులను ఉపేక్షించొద్దు ‘కోవిడ్ చికిత్స విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, ఆరోగ్యరంగంలోని వృత్తినిపుణులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోండి. కఠిన విపత్తు నిర్వహణ(సవరణ) చట్టం–2020 కింద కేసు నమోదుచేయండి. సిబ్బందిపై దాడి, బెదిరింపు తదితర ఘటనలు వారిలో నైతికస్థైర్యాన్ని దెబ్బతీసి అభద్రతా భావాన్ని పెంచే ప్రమాదముంది. దాడికి పాల్పడే వారిపై కేసులు పెట్టి త్వరితగతిన శిక్షలుపడే చూడండి’ అని భల్లా పేర్కొన్నారు. విపత్తు చట్టం కింద గరిష్టంగా ఐదేళ్ల జైలు, రూ.1లక్ష జరిమానా విధిస్తారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా గాయపడితే నిందితుడికి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. -
‘కోవిడ్’పై అమిత్ షా సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కేంద్ర వైద్య శాఖాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భళ్లాలు పాల్గొన్నారు. కేవలం కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడంపై ఆయన పలు విషయాలు ఆరా తీశారు. కోవిడ్‌ను అడ్డుకునేందుకు ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాల్సిందిగా సూచించారు. ఆయా రాష్ట్రాలకు కేంద్రం నుంచి చేయదగ్గ సహాయాలను అందించాలని కోరినట్లు అధికారులు చెప్పారు. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,417 కేసులు బయటపడగా మొత్తం కేసుల సంఖ్య 19,94,947కు చేరుకుంది. -
అన్‌లాక్ 3.0: యూటీలు, రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అన్‌లాక్-3 ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అంతర్రాష్ట్ర, రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు ప్రజల రాకపోకలు, వస్తువుల రవాణాపై ఇంకా నిషేధం కొనసాగించడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి చర్యల వల్ల ఆర్థిక కార్యకలాపాలకు భంగం కలగడంతో పాటుగా ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. అంతర్రాష్ట్ర, రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగించవచ్చని ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిందని, అయినప్పటికీ ఆంక్షలు విధిస్తే దీనిని ఉల్లంఘన చర్యగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించింది. (అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల) ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. నిబంధనలు ఎత్తివేయాలంటూ విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ- పర్మిట్ల పేరిట సరుకు రవాణాకు ఆటంకం కలిగించవద్దని కోరారు. ఒకవేళ ఇలాంటి ఆంక్షల గురించి మరోసారి తమ దృష్టికి వస్తే విపత్తు నిర్వహణ చట్టం-2005లోని నిబంధనల ప్రకారం ఉల్లంఘన చర్యగా పరగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి నేపథ్యంలో మార్చి 24 అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. (అన్‌లాక్ 4.0: తెరుచుకోనున్న సినిమాహాళ్లు!) ఈ క్రమంలో పలు దఫాలుగా నిబంధనలు సడలించిన కేంద్ర ప్రభుత్వం మే రెండోవారంలో అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించింది. అయితే అన్‌లాక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు గతంలో ప్రకటించిన హోం మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఈ మేరకు లేఖ రాయడం గమనార్హం. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న అన్‌లాక్-3 ఆగష్టు 31తో ముగియనున్న తరుణంలో ఇన్నాళ్లుగా మూతపడ్డ థియేటర్లు, మార్కెట్లను కనీస జాగ్రత్తలు పాటిస్తూ తెరిచేందుకు కేంద్రం అనుమతించినున్నట్లు తెలుస్తోంది. ఇక దేశంలో గడచిన 24 గంటల్లో 69,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కోవిడ్ బాధితుల సంఖ్య 29,75,702 కు చేరుకుంది. మొత్తంగా 55,794 కరోనాతో మరణించారు. ఇక దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత దృష్ట్యా ఇప్పటికీ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో అజయ్ భల్లా ఈ మేరకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. -
బుసలు కొడుతున్న కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మృత్యుఘోష ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. బుధవారం నుంచి గురువారం వరకు ఒక్క రోజు వ్యవధిలో 5,609 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 132 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో దేశంలో ఇప్పటిదాకా పాజిటివ్ కేసులు 1,12,359కి, మొత్తం మరణాలు 3,435కి చేరాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 63,624 కాగా, 45,299 మంది బాధితులు చికిత్సతో కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 40.32 శాతానికి చేరడం కొంత ఉపశమనం కలిగిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా గురువారం పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రభుత్వ మర్గదర్శకాల ప్రకారం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. ఆ ఆస్పత్రి.. కరోనా శ్మశానం గుజరాత్‌లోని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి ‘కరోనా శ్మశానం’గా మారింది. గుజరాత్లో కోవిడ్‌తో 749 మంది కన్నుమూయగా, అందులో దాదాపు సగం.. అంటే 351 మరణాలు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మరణించారు. ఈ హాస్పిటల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలో రైలు టికెట్లు క్యాన్సిల్ ప్రత్యేక రైళ్లలో మహారాష్ట్రలో మాత్రమే ప్రయాణించే వారి టికెట్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం అంతర్ జిల్లా ప్రయాణాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
పూర్తి వేతనాల చెల్లింపు ఉత్తర్వులు వెనక్కి
న్యూఢిల్లీ: దేశంలో లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో వివిధ వాణిజ్య సంస్థలు, కంపెనీలు పనిచేయకున్నా సరే, సిబ్బందికి పూర్తి వేతనాలివ్వాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం ఉపసంహరించుకుంది. నాలుగో విడత లాక్డౌన్ మార్గదర్శకాలను విడుదల చేస్తూ హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ విషయం వెల్లడించారు. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద జారీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆదాయం లేని సమయంలో, పూర్తి వేతనాలు చెల్లించే స్తోమత లేని చాలా కంపెనీలు, పారిశ్రామిక యూనిట్లకు ఊరట లభించినట్లయింది. వేతనాలు చెల్లించలేని కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
లాక్డౌన్ : కేంద్రం కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో కేవలం నిత్యావసర సర్వీసులు మాత్రమే అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు సోమవారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్ల లేఖ రాశారు. కంటైన్మెంట్ జోన్లో మినహా.. మిగిలిన జోన్లలో యధావిధిగా కార్యకలాపాలు కొనసాగించాలని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర నిషేధించిన జాబితాలోని కార్యకలాపాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగించకూడదని స్పష్టం చేశారు. (లాక్డౌన్: కొత్త నిబంధనలు ఇవే!) -
ఏ రాష్ట్రంలోనూ వారిని అడ్డుకోవద్దు: కేంద్రం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నియంత్రణ నేపథ్యంలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది రాకపోకలను ఏ రాష్ట్రంలోనూ అడ్డుకోరాదని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేంద్ర హోంశాఖ కోరింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సోమవారం లేఖ రాశారు. వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు సహకరించాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు రాసిన మరో లేఖలో కోరారు. (తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు ఇవీ ..) లేఖలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మెడికల్ ప్రొఫెషనల్స్, పారా మెడికల్ సిబ్బంది, ఇతర వైద్య సిబ్బంది రాకపోకలపై ఆంక్షలు విధించినట్టు మా దృష్టికొచ్చింది. ► కరోనా నివారణలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వీరు.. విధుల్లో భాగంగా రాకపోకలను సాగించాల్సి ఉన్నందున అడ్డంకులు సృష్టించొద్దు. ► ప్రయివేటు క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లకు అడ్డంకులు సృష్టించకుండా వాటిని కొనసాగించేలా చూడండి. ► పారిశుద్ధ్య సిబ్బంది రాకపోకలకూ ఆటంకాలు కలిగించకుండా చర్యలు తీసుకోవాలి. ► వలస కూలీలను సొంతూళ్లకు చేర్చేందుకు అవసరమైన ప్రత్యేక శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. వారిని వారి ప్రాంతాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలి. ► వలస కూలీలు రోడ్డు మార్గంలో, రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ► రైళ్లు, బస్సులు ఏర్పాటయ్యే వరకు వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలి. రీస్టార్ట్‌కి రెడీ అవుదాం: సీఎంలతో ప్రధాని మోదీ