సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో కేవలం నిత్యావసర సర్వీసులు మాత్రమే అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు సోమవారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్ల లేఖ రాశారు. కంటైన్‌మెంట్ జోన్లో మినహా.. మిగిలిన జోన్లలో యధావిధిగా కార్యకలాపాలు కొనసాగించాలని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర నిషేధించిన జాబితాలోని కార్యకలాపాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగించకూడదని స్పష్టం చేశారు. (లాక్‌డౌన్: కొత్త నిబంధనలు ఇవే!)
Comments
Please login to add a commentAdd a comment