సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను తాజాగా పొడిగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినా మరికొన్నాళ్లు ఈ మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు గైడ్‌లైన్స్‌ను మరికొన్నాళ్లు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31వ తేదీ వరకు మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కేసులు తగ్గుతున్నాయని ఆత్మ సంతృప్తి చెందవద్దని ఈ సందర్భంగా హెచ్చరించింది.
కొన్ని రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల, ఆర్ ఫ్యాక్టర్ అధికంగా ఉండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పండుగల నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలు కరోనా మార్గదర్శకాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. స్థానికంగా కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షల సడలింపులపై నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పంచ వ్యూహం సిద్ధం చేసింది. టెస్ట్.. ట్రాక్.. ట్రీట్.. టీకా.. కరోనాగా పేర్కొంది. మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment