
న్యూఢిల్లీ: తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీనేత లా గణేశన్‌ను కేంద్రం మణిపూర్ గవర్నర్‌గా నియమించింది. ఈ నెల 10న గవర్నర్ నజ్మా హెప్తుల్లా పదవీ విరమణ పొందినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా
ఉంది. గవర్నర్‌గా గణేశన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. ఆయన నియామకం పట్ల తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిలిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. గణేశన్ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment