Ganesan
-
మణిపూర్ గవర్నర్‌గా గణేశన్
న్యూఢిల్లీ: తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీనేత లా గణేశన్‌ను కేంద్రం మణిపూర్ గవర్నర్‌గా నియమించింది. ఈ నెల 10న గవర్నర్ నజ్మా హెప్తుల్లా పదవీ విరమణ పొందినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. గవర్నర్‌గా గణేశన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. ఆయన నియామకం పట్ల తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిలిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. గణేశన్ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. -
సీఐ హత్య కేసులో ప్రియురాలికి యావజ్జీవం
కేకే.నగర్ : సబ్ ఇన్స్పెక్టర్ను కత్తితో పొడిచి హత్య చేసిన ప్రియురాలికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ చిదంబరం కోర్టు తీర్పు ఇచ్చింది. విళ్లుపురం జిల్లా ఉళుందూరు పేటకు చెందిన పావాడై కుమారుడు గణేశన్ (32). ఇతడు 2011వ సంవత్సరం కడలూరు జిల్లా చిదంబరం సమీపంలో బ్రాంచ్ పోలీసుస్టేషన్లో సీఐ. అదే పోలీసుస్టేషన్ కు అంబలత్తాడి కుప్పం గ్రామానికి చెందిన కలైమణి అను, అతని భార్య వనిత (25) ఒక కేసు విషయమై తరచూ వచ్చి వెళ్లేది. ఆ సమయంలో గణేశన్‌కు, వనితకు మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వనిత తన భర్త కలైమణికి విడాకులు ఇచ్చి గణేశన్‌ను వివాహం చేసుకోవడానికి నిర్ణయించింది. అయితే గణేశన్ కొన్ని కారణాల వలన వనితతో వివాహానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో గణేశన్‌కు అతని తల్లిదండ్రులు కుదిర్చిన మరో యువతితో 2014లో వివాహం జరిగింది. ఈ విషయం తెలిసి వనిత తనను కూడా పెళ్లి చేసుకోవాలని కోరుతూ గణేశన్పై వత్తిడి తెచ్చింది. అతను అంగీకరించకపోవడంతో 2014 జూలై 21వ తేదీ అన్నామలైనగర్‌లో ఉన్న గణేశన్ ఇంటికి వెళ్లిన వనిత అతన్ని కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ కేసుపై విచారణ చిదంబరం జిల్లా అదనపు బెంచ్ న్యాయస్థానంలో జరిగింది. విచారణ జరిపిన న్యాయమూర్తి కింగ్స్లీ క్రిస్టోఫర్ బుధవారం తీర్పులో వనితకు యావజ్జీవ కారాగారశిక్ష రూ.1000 జరిమానా విధించారు. అనంతరం వనితను పోలీసు వ్యాన్‌లో వేలూరు జైలుకు తరలించారు. -
సినీ నిర్మాత అరెస్ట్
తిరువొత్తియూరు: సినిమా నిర్మాణం కోసం రూ.48 లక్షలు తీసుకుని మోసం చేసిన నిర్మాతను పోలీసులు అరెస్టు చేశారు. పుదుకోట్టై జిల్లా కె.పుదుపట్టు గ్రామానికి చెందిన సెల్వరాజ్ కుమారుడు సెంథిల్‌బాబు (31)కు చెన్నై నెర్కుండ్రంకు చెందిన గణేషన్ తాను సినీ నిర్మాతనని పరిచయం చేసుకున్నారు. సినిమా తీస్తున్నానని, అది విజయం సాధించగానే డబ్బు తిరిగి ఇస్తానని నమ్మించి రూ.48 లక్షలు తీసుకున్నాడు. నగదు తీసుకున్న గణేషన్ సినిమా విడుదల అయిన తరువాత ఒప్పందం ప్రకారం అతనికి లాభంలో వాటాను గాని అసలు కాని ఇవ్వలేదు. మోసపోయిన సెంథిల్‌బాబు చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు చేపట్టిన విచారణలో గణేషన్ మోసం చేసినట్టు నిర్ధారణ కావడంతో మంగళవారం సాయంత్రం అతన్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచి పుళల్ జైలుకు తరలించారు. -
ఆస్తి తగాదాలపై కోర్టుకెళతా!
‘‘చెన్నైలోని పొయస్ గార్డెన్లో ఉన్న ఇంటికి సంబంధించి కొంత కాలంగా నాకూ, నా సోదరుడు గణేశన్కీ మధ్య వివాదం నడుస్తోంది. ఆ ఇంట్లో నాకు రావాల్సిన వాటాను చట్టపరంగా దక్కించుకుంటా’’ అని సీనియర్ నటుడు కార్తీక్ అన్నారు. శుక్రవారం చెన్నైలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రముఖ నటుడు స్వర్గీయ ముత్తురామన్ తనయుడైన కార్తీక్ తమిళంలో మాత్రమే కాదు.. 1980లలో ‘అభినందన’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. తండ్రి ముత్తురామన్ ఆస్తులు పంచుకొనే విషయంలో ఆయన తనయుల మధ్య వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో పొయస్ గార్డెన్ ఇంటి నుంచి కార్తీక్ బయటికొచ్చేశారనీ, విడిగా ఉంటున్నారనీ వార్తలొచ్చాయి. కాగా, సోదరుడు గణేశన్పై పోలీస్ స్టేషన్లో కార్తీక్ ఫిర్యాదు చేశారు. విచిత్రం ఏంటంటే.. కార్తీక్ తల్లి సులోచన కార్తీక్‌పై అదే పోలీస్ స్టేషన్లో కేసుపెట్టారు. తమ మధ్య జరుగుతున్న వివాదం గురించి ఇన్నాళ్లూ నోరువిప్పని కార్తీక్ శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ -‘‘మా నాన్నగారి స్థిరాస్తుల్లో వాటా దక్కించుకోవడానికి కోర్టుకెళ్లడానికి నేను వెనకాడను. నాన్నగారి మరణానంతరం ఆస్తులకు సంబంధించిన అసలు వీలునామాను దాచేసి, నకిలీవి సృష్టించారు. అదేమిటని నా సోదరుడు గణేశన్‌ని అడిగితే, ‘ఇది అమ్మ రాసిన వీలునామా’ అని చెప్పారు. ఆ వీలునామా ఆంగ్ల భాషలో ఉంది. నిజానికి మా అమ్మగారికి ఆంగ్లం రాదు. గణేశన్‌తో మనస్పర్థలు వచ్చిన తర్వాత నేను ఆ ఇంటి నుంచి వెళ్లిపోయానని అందరూ చెప్పుకుంటున్నారు. నేనెక్కడికీ వెళ్లలేదు. పొయస్ గార్డెన్ ఇంట్లోనే ఉంటున్నాను. మరో రెండు రోజుల్లో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి గణేశన్ ముందుకు రాకపోతే చట్టపరంగా కోర్టుకెక్కాలనుకుంటున్నా’’ అని చెప్పారు. తనకు తగిన భద్రత కల్పించాలని కూడా ఈ సందర్భంగా కార్తీక్ పేర్కొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
వేలూరు: ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ గణేషన్ తెలిపారు. శనివారం ఉదయం వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లు, యజమానులతో డీఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆటో యజమానులు, డ్రైవర్లను పనిలో చేర్పించే ముందు వారి పూర్తి చిరునామాను తెలిసి ఉంచుకోవాలన్నారు. డ్రైవర్లు తప్పక యూనిపామ్‌లను ధరించి ఆటోలను నడపాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం మత్తులో ఆటోలను నడిపితే లెసైన్స్‌లను రద్దు చేస్తామన్నారు. ఆటోలో ముగ్గురికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, డ్రైవర్ సీటు పక్కన ప్రయాణికులను కూర్చో పెట్టరాదన్నారు. అనుమానం వచ్చే విధంగా ఎవరైనా ఆటోలో ప్రయాణం చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఆటోలను కేటాయించిన ప్రాంతంలోనే నిలపాలని, ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వారిని ఆసుపత్రిలో చేర్పించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రయాణికుల వద్ద అధిక రుసుము వసూలు చేయరాదని తదితర నిబందనలను తెలిపారు. ఈసందర్భంగా డ్రైవర్లు పలు సమస్యలను పోలీసులకు వివరించారు. -
మృత్యుంజయుడు
సాక్షి, చెన్నై:తిరునల్వేలి జిల్లా శంకరన్ కోయిల్ సమీపంలోని కుత్తాలం పేరి గ్రామంలో తండ్రి గణేషన్‌తో కలసి నిమ్మతోటకు హర్షన్(3) వెళ్లాడు. సరిగ్గా పదిన్నర గంటల సమయంలో తండ్రితో కలసి అడుగులు వేస్తున్న చిన్నోడు బోరు బావిలో పడిపోయూడు. తండ్రి గణేశన్ వెంటనే ఆందోళనలో పడ్డాడు. ఆయన కేకలను విన్న అక్కడి వారు అగ్నిమాపక సిబ్బందికి, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.ధైర్యాన్ని ఇచ్చిన తండ్రి: తనయుడు బావిలో పడిన ఆందోళన నుంచి తేరుకున్న గణేషన్ చాకచక్యంగా వ్యవహరించారు. తనయుడికి ధైర్యాన్ని నూరి పోస్తూ పై నుంచి తానూ లోనికి వస్తున్నా, అక్కడే ఉండు ఆడుకుందాం అంటూ పదే పదే చెబుతూ హర్షన్లో భయాన్ని తొలగించారు. సమాచారం అందుకున్న అంబులెన్స్‌లు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకున్నారు. బాలుడికి ఆక్సిజన్ సరఫరా అయ్యే ఏర్పాట్లు చేశారు. అలాగే, అతడితో మాట్లాడుతూనే ఉండమంటూ గణేషన్‌కు సూచించిన అధికారులు సహాయక చర్యల్లో మునిగారు.సహాయక చర్యలు: నాలుగు జేసీబీలను రప్పించి ఆ బోరు బావికి సమాంతరంగా పక్కనే గోతి తవ్వేందుకు చర్యలు తీసుకున్నారు. బోరు బావిలోకి కెమెరాను పంపించి బాలుడు ఎంత లోతులో ఉన్నాడో పసిగట్టారు. సరిగ్గా 15 అడుగుల కింద ఆ బాలుడు ఉన్నట్టు తేలింది. ఆ బోరు బావి 400 అడుగులు కావడంతో ఏ సమయంలో బాలుడు కిందకు జారుతాడోనన్న ఉత్కంఠ, ఆందోళన నెలకొంది. సరిగ్గా 8 అడుగుల లోతు వద్ద అతి పెద్ద బండరాళ్లు అడ్డు పడటంతో గంట పాటుగా సహాయక చర్యలకు ఆటంకం నెలకొంది. బాలుడి పరిస్థితిని ఎప్పటికప్పుడు కెమెరా ద్వారా పరిశీలిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. బండరాళ్ల తొలగింపునకు డ్రిల్లింగ్ యంత్రాల్ని ఉపయోగించడంతో, మట్టి పెళ్లలు బాలుడి నెత్తిన పడ్డట్టు గుర్తించారు. దీంతో సహాయక పనుల్ని ఆపేశారు. రంగంలోకి ప్రత్యేక బృందం : మదురైకు చెందిన మణిగండన్, రాజ్‌కుమార్, తిరునావుకరసు, వల్లరసుల నేతృత్వంలోని ప్రత్యేక బృందం బోరు బావుల నుంచి పిల్లల్ని రక్షించే రోబోను ఇటీవల తయారు చేసింది. దీన్ని పలు చోట్ల ప్రయోగించినా, ఫలితం శూన్యం. అయితే, మదురై నుంచి గంటన్నర వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఈ బృందం మూడున్నర గంటల పాటుగా శ్రమించింది. చేతి ఆకారాన్ని తలపించే రీతిలో కింది భాగంలోను, పై భాగంలో అత్యాధునిక యంత్రాలతో సిద్ధం చేసిన తమ రోబోను ఆ బోరు బావిలోకి చాకచక్యంగా పంపించింది. ఆ రోబో, కెమెరాలు, లైట్లు లోనికి వెళ్లే సమయంలో గణేషన్ ఇచ్చిన ధైర్యం ఆ చిన్నాడిలో భయాన్ని పూర్తిగా పోగొట్టిందని చెప్పవచ్చు. తానూ లోనికి వస్తున్నా, చూస్తూ ఉండు, తల పైకి ఎత్తు అంటూ ఆయన పెట్టిన కేకలకు తోడుగా లోనికి వెళ్లిన రోబో ఆ బాలుడ్ని ఆమాంతంగా పైకి తీసుకొచ్చేసింది. పదిహేను అడుగుల లోత నుంచి బయట పడ్డ చిన్నాడు అక్కడి జనాన్ని చూసి షాక్‌కు గురయ్యాడో ఏమో గానీ, తనకు ఏదో జరిగిందన్న ఆందోళన కాసింత కూడా అతడి ముఖంలో కన్పించక పోవడం విశేషం. మృత్యుంజయుడు: బోరు బావి నుంచి మృత్యుంజయుడిగా బయట పడ్డ హర్షన్ను హుటా హుటిన ఓ పోలీసు అధికారి తన భుజాన వేసుకుని అంబులెన్స్‌లో శంకరన్ కోయిల్ ఆస్పత్రికి ఉరకలు తీశారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు ఆ బాలుడికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మృత్యుంజయుడిగా ప్రకటించారు. అతడికి ఇన్ఫెక్షన్ మాత్రం ఉందని, అందుకు తగ్గ చికిత్సలు అందించామని, అతడికి ఇక ప్రాణహాని లేదని వైద్యులు ప్రకటించడంతో బోరు బావి నుంచి రాష్ట్రంలో మృత్యుంజయుడిగా బయటకు వచ్చిన వారిలో హర్షన్ రెండో వాడయ్యాడు. ప్రశంసల జల్లు: బోరు బావి నుంచి రోబో యంత్రం సాయంతో బయట పడ్డ హర్షన్ అందరినీ అటు ఇటూ చూస్తుండడంతో అక్కడున్న వాళ్లనే కాదు, ఓ ఛానల్ ప్రత్యక్షంగా ప్రసారం చేసిన ఈ దృశ్యాల్ని చూసిన వారిని ఆనందంలో పడేసింది. రోబోను సకాలంలో సంఘటనా స్థలానికి తీసుకొచ్చి, తమ సేవలను అందించిన మదురైకు చెందిన సహాయక బృందాన్ని ఆ జిల్లా కలెక్టర్ కరుణాకరన్, అగ్నిమాపక అధికారి పద్మకుమార్ అభినందించారు. అక్కడ సేవలను అందించిన ప్రతి ఒక్కరినీ కలెక్టర్ అభినందించారు. ఆరు గంటల వ్యవధిలో బాలుడిని రక్షించిన తమ బృందం సేవలను ప్రత్యేకంగా కొనియాడుతూ కలెక్టర్ ఆనందంలో ఉబ్బితబ్బియ్యారు. గుర్తింపు ఇవ్వండి: తాము పన్నెండు రకాల రోబోలను సిద్ధం చేశామని ఆ ప్రత్యేక బృందం పేర్కొంది. తమకు సకాలంలో సమాచారం అందిన పక్షంలో రక్షించేందుకు వీలుందన్నారు. ఆరు, ఎనిమిది, పన్నెండు ఇంచ్‌లతో కూడిన రోబోలు తమ వద్ద ఉన్నాయని వివరిస్తూ, గతంలో తాము పలు మార్లు ఈ పరికరాల్ని ఉపయోగించినా, ఆలస్యం కారణంగా పిల్లలను రక్షించ లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే, ప్రస్తుతం తమకు సమాచారం త్వరితగతిన రావడంతో సకాలంలో ఇక్కడికి వచ్చామని పేర్కొన్నారు. మానవ నిర్మిత రోబోను తాము ఉత్కంఠ భరితంగా ఉపయోగించినా, ఆ దేవుడి ఆశీస్సులు చిన్నోడికి ఉండబట్టే సురక్షితంగా బయట పడ్డాడని ఆ బృందానికి చెందిన మణిగండన్ పేర్కొనడం విశేషం. తాము సిద్దం చేసిన రోబోలకు గుర్తింపు ఇవ్వాలని, దీనిని ప్రతి అగ్నిమాపక వాహనంలో తప్పని సరిగా ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నీళ్లు లేని బోరు బావుల్ని మూసి వేయాలని, కొత్తగా బోరు బావులు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా అధికారుల అనుమతి పొందాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు అమల్లో బేఖాతరు అవుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా రాష్ట్రంలో ఇద్దరు లేదా, ముగ్గురు పిల్లలను బోరు బావులు మింగేస్తున్నాయి. ముక్కు పచ్చలారని చిన్నారులు బోరు బావుల్లో పడి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగుల్చుతున్నారు. సరిగ్గా ఈ నెల ఐదో తారీఖున విల్లుపురం జిల్లా కళ్లకురిచ్చి సమీపంలోని త్యాగరాయ దురం పల్ల చేరి గ్రామానికి చెందిన రామచంద్రన్ కుమార్తె మధుమిత(3)ను బోరుబావి మింగేసింది. ఈ చిన్నారిని రక్షించేందుకు అధికారులు శాయశక్తులా కృషి చేశారు. ప్రాణాలతో బోరు బావి నుంచి బయటకు తీసినా, ఆస్పత్రిలో ఆ చిన్నారి తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనతో శోకతప్త హృదయంలో మునిగిన రాష్ట్ర ప్రజలు, సోమవారం ఉదయాన్నే మరో చేదు సమాచారాన్ని విని తల్లడిల్లారు. కానీ హర్షన్ క్షమంగా బయటపడడంతో అందరూ ఆనందంలో మునిగి తేలారు.