తిరువొత్తియూరు: సినిమా నిర్మాణం కోసం రూ.48 లక్షలు తీసుకుని మోసం చేసిన నిర్మాతను పోలీసులు అరెస్టు చేశారు. పుదుకోట్టై జిల్లా కె.పుదుపట్టు గ్రామానికి చెందిన సెల్వరాజ్ కుమారుడు సెంథిల్‌బాబు (31)కు చెన్నై నెర్కుండ్రంకు చెందిన గణేషన్ తాను సినీ నిర్మాతనని పరిచయం చేసుకున్నారు. సినిమా తీస్తున్నానని, అది విజయం సాధించగానే డబ్బు తిరిగి ఇస్తానని నమ్మించి రూ.48 లక్షలు తీసుకున్నాడు.
నగదు తీసుకున్న గణేషన్ సినిమా విడుదల అయిన తరువాత ఒప్పందం ప్రకారం అతనికి లాభంలో వాటాను గాని అసలు కాని ఇవ్వలేదు. మోసపోయిన సెంథిల్‌బాబు చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు చేపట్టిన విచారణలో గణేషన్ మోసం చేసినట్టు నిర్ధారణ కావడంతో మంగళవారం సాయంత్రం అతన్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచి పుళల్ జైలుకు తరలించారు.
సినీ నిర్మాత అరెస్ట్
Published Thu, Nov 5 2015 3:41 AM | Last Updated on Tue, Oct 2 2018 3:00 PM
Advertisement
Advertisement