Najma Heptullah
-
మణిపూర్ గవర్నర్‌గా గణేశన్
న్యూఢిల్లీ: తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీనేత లా గణేశన్‌ను కేంద్రం మణిపూర్ గవర్నర్‌గా నియమించింది. ఈ నెల 10న గవర్నర్ నజ్మా హెప్తుల్లా పదవీ విరమణ పొందినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. గవర్నర్‌గా గణేశన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. ఆయన నియామకం పట్ల తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిలిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. గణేశన్ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. -
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 75 సంవత్సరాల వయసు రావడంతో కేంద్ర మంత్రి పదవి నుంచి ఇటీవలే తప్పుకొన్న సీనియర్ నాయకురాలు డాక్టర్ నజ్మాహెప్తుల్లాను మణిపూర్ గవర్నర్‌గా నియమించారు. ఆమె ఈ రాష్ట్రానికి 18వ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2015 సెప్టెంబర్ 30వ తేదీ నుంచి మణిపూర్ బాధ్యతలను కూడా మేఘాలయ గవర్నర్ వి. షణ్ముగనాథన్ చూస్తున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్ వచ్చారు. ఈ రాష్ట్రానికి వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆమెతో పాటు అసోం గవర్నర్‌గా బన్వారీలాల్ పురోహిత్, పంజాబ్ గవర్నర్‌గా వీపీ సింగ్ బద్నోర్లను నియమించారు. అలాగే, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ గా జగదీష్ ముఖిని నియమించారు. -
ప్రాచీన విజ్ఞానం.. ప్రపంచానికి చెబుదాం
కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా సాక్షి, సిటీబ్యూరో : ప్రాచీన పరిశోధన పుస్తకాల్లో నిక్షిప్తమైన అరుదైన శాస్త్ర విజ్ఞానాన్ని ఆధునిక ప్రపంచానికి అందించాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి నజ్మాహెప్తుల్లా అన్నారు. సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని ప్రాచీన దాయిరతుల్ మారిఫ్ పుస్తక భాండాగారాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాచీన పుస్తకాల్లో అనేక సంస్కృతుల చరిత్ర నిక్షిప్తమై ఉందన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి భారత దేశానికి వచ్చిన వారు వివిధ సంస్కృతిలను వదిలి వెళ్ళారన్నారు. ప్రాచీన పుస్తకాలను కంప్యూటరీకరించి ఆంగ్లంలో అనువదించి ప్రపంచానికి తెలియచేయాలన్నారు. ఫైసల్ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదిరితే మన ప్రాచీన పుస్తకాల ఆధునీకరణకు దోహదపడుతుందన్నారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఆరవింద్ మాయరామ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల ప్రాజెక్టు కింద ప్రాచీన పుస్తకాల ఆధునీకరణకు నిధులు కేటాయించిద్నారు. దాయిరతుల్ మారిఫ్ డెరైక్టర్ ఫ్రొఫెసర్ ముస్తాక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు. న్యాక్‌ను సందర్శించిన నజ్మాహెప్తుల్లా మాదాపూర్ : మైనార్టీ శాఖమంత్రి నజ్మా హెప్తుల్లా మాదాపూర్‌లోని న్యాక్‌ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాక్‌లో మైనార్టీలకు ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేయాలని కోరారు. న్యాక్‌లో వివిధ విభాగాలను పరిశీలించి సిబ్బంది సేవలను కొనియాడారు. -
నజ్మా ‘హిందూ’ వ్యాఖ్యలపై వివాదం
అలా అనలేదని వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి న్యూఢిల్లీ: భారతీయుులందరూ హిందువులంటూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖమంత్రి నజ్మా హెప్తుల్లా వ్యాఖ్యానించారని వచ్చిన వార్తలు వివాదాస్పదమయ్యూయి. దీంతో ఆమె శనివారం వివరణ ఇచ్చారు. భారతీయుుల జాతీయత విషయుంలో అరబ్బీ భాషలో హిందీ.. అనే పదం వాడానని, మతకోణంలో వ్యాఖ్యలు చేయులేదని స్పష్టంచేశారు. హిందూఅనే మాటను వాడనేలేదని తెలిపారు. భారతీయుులకు జాతీయత విషయుంలో ఏకరూపత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మూడు భాషల్లో మూడురకాలుగా ఇది ఉందని, అరబిక్‌లో హిందీ, పర్షియున్లో హిందుస్థానీ, ఇంగ్లిషులో ఇండియున్ అనే పదాలను వాడుతున్నారన్నారు. అంశంపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ, మంత్రి రాజ్యాంగాన్ని చదువుకోవాలని, అందులో భారత్, భారతీయ.. అనే పదాలు ఉంటాయితప్ప హిందూ అని ఉండదని పేర్కొన్నారు. -
ముస్లింలు మైనారిటీ కాదు: నజ్మా హెప్తుల్లా
న్యూఢిల్లీ: కేంద్రంలో మైనారిటీ వ్యవహారాల శాఖ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మీడియా సమావేశంలో ఆ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 13.8 కోట్ల మంది ముస్లింలున్నారని, వారిని మైనారిటీలుగా పరిగణించలేమన్నారు. ముస్లింల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్న ప్రశ్న కు స్పందిస్తూ.. ‘ముస్లింలే ఎందుకు? నేను నిర్వహిస్తోంది కేవలం ముస్లిం వ్యవహారాల శాఖ కాదు. ముస్లింలు మైనారిటీ వర్గానికి చెం దరు. నిజానికి పార్శీలు మైనారిటీలు. వారి జనాభా క్రమంగా తగ్గుతోంది’ అన్నారు. ‘రిజర్వేషన్లు కల్పించడం ముస్లింల సమస్యలకు పరిష్కారం కాదు. అది కేవలం పలాయన మార్గం’ అని అన్నారు.