న్యూఢిల్లీ: కేంద్రంలో మైనారిటీ వ్యవహారాల శాఖ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మీడియా సమావేశంలో ఆ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 13.8 కోట్ల మంది ముస్లింలున్నారని, వారిని మైనారిటీలుగా పరిగణించలేమన్నారు. ముస్లింల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్న ప్రశ్న కు స్పందిస్తూ.. ‘ముస్లింలే ఎందుకు? నేను నిర్వహిస్తోంది కేవలం ముస్లిం వ్యవహారాల శాఖ కాదు. ముస్లింలు మైనారిటీ వర్గానికి చెం దరు. నిజానికి పార్శీలు మైనారిటీలు. వారి జనాభా క్రమంగా తగ్గుతోంది’ అన్నారు. ‘రిజర్వేషన్లు కల్పించడం ముస్లింల సమస్యలకు పరిష్కారం కాదు. అది కేవలం పలాయన మార్గం’ అని అన్నారు.