కేంద్రం కీలక నిర్ణయం.. ‘సిమి’పై మరో ఐదేళ్లు నిషేధం | Centre Extends Ban Terror Outfit SIMI Under UAPA Another Five Years | Sakshi
Sakshi News home page

కేంద్రం కీలక నిర్ణయం.. ‘సిమి’పై మరో ఐదేళ్లు నిషేధం

Published Mon, Jan 29 2024 6:13 PM | Last Updated on Mon, Jan 29 2024 6:25 PM

Centre Extends Ban Terror Outfit SIMI Under UAPA  Another Five Years - Sakshi

న్యూఢిల్లీ: చట్ట విరుద్ధమైన స్టుడెంట్స్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా(SIMI)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం(UAPA) కింద.. సిమిపై మరో ఐదేళ్ల పాటు నిషేధం కొనసాగుతుందని సోమవారం ప్రకటించింది.  ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ‘ఎక్స్‌’ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. మొదటి ఏన్డీయే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 2014లో ఉపా చట్టం కింద ‘సిమి’ సంస్థపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. 

‘ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న ప్రధాని మోదీ విధానాన్ని బలపరుస్తూ.. యూఏపీఏ కింద ‘సిమి’ని మరో ఐదేళ్లపాటు ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా ప్రకటించబడింది. భారత సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించేలా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం, శాంతి, మతసామరస్యానికి భంగం కలిగించడంలో ‘సిమి’ ప్రమేయం ఉన్నట్లు తేలింది’ అని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement