
ధార్వాడ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
సాక్షి, హుబ్లీ: కూలిపోయిన ఇంటికి పరిహారం కోసం తిరిగి తిరిగి వేసారిన ఓ మహిళ స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంటి ఎదుట డెత్‌నోట్ రాసి పెట్టి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడలో బుధవారం చోటుచేసుకుంది. ధార్వాడ తాలూకా గరగ గ్రామానికి చెందిన శ్రీదేవి అనే మహిళకు చెందిన ఇల్లు గత ఏడాది వర్షాకాలంలో అతివృష్టితో కూలిపోయింది.
పరిహారం ఇప్పించి ఆదుకోవాలని కొన్ని నెలలుగా ధార్వాడ గ్రామీణ ఎమ్మెల్యే అమృత్ దేశాయిని కలిసి విజ్ఞప్తులు చేసింది. ఆయన ఎంపీకి విజ్ఞప్తి చేయాలని సూచించారు. ఆమె ధార్వాడ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంటికి వెళ్లి పరిహారం కోసం మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. విసిగి వేసారిన శ్రీదేవి ఆయన ఇంటి ఎదుట లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర అస్వస్థతకు పాలైన ఆమెను విమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment