కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాక్షాత్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్న కార్యక్రమాల్లోనే అపశ్రుతులు చోటేచేసుకున్నాయి. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. దళితులు, పేదలకు ఆయన చేసిందేమి లేదు..’’ అంటూ అమిత్ షా ప్రసంగాన్ని పొరపాటుగా అనువదించడం సంచలనం రేపింది. ఇప్పటికే ‘యడ్యూరప్ప సర్కార్ అవినీతిలో నంబర్‌వన్’ అని నాలుక కరుచుకున్న షా.. పరోక్షంగా మళ్లీ పప్పులో కాలేసినట్లైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో వైరల్ అయింది.