బెంగళూరు: బెంగళూరులో భాషా ఉద్యమంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. కర్ణాటకలో దుకాణాల బోర్డులు ప్రధానంగా స్థానిక భాషలో ఉండాలనే డిమాండ్‌తో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర రాజధాని బెంగళూరులో కన్నడ అనుకూల గ్రూపులు బుధవారం విధ్వంసం చేసిన తర్వాత ఆయన ఈ మేరకు మాట్లాడారు.
"ప్రతి ఒక్కరూ సంకేతాలను చదవగలగాలి. అందరూ ఇంగ్లీష్ చదవలేరు. కన్నడలో అలాగే ఇంగ్లీష్ లేదా హిందీ వంటి ఇతర భాషలలో రాయడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? ఇది ఇంగ్లాండ్ కాదు. దుకాణదారులు కూడా అవసరాన్ని అర్థం చేసుకోవాలి " అని ప్రహ్లాద్ జోషి అన్నారు.
కన్నడనాట మరోసారి భాష ప్రతిపాదిత ఆందోళనలు బుధవారం జరిగాయి. నేమ్ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ముందు కన్నడ సంఘాలు ఉద్యమం మొదలుపెట్టాయి. కొన్ని హోటల్స్‌పై దాడులకు దిగాయి. దీంతో బెంగళూరు అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎయిర్‌పోర్ట్ బయట కన్నడ కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో నేమ్ ప్లేట్లు ఉంచడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది కన్నడ రక్షా వేదిక. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆందోళకు దిగింది. కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్ బయట ఇతర భాషల నేమ్ బోర్డుల్ని ధ్వంసం చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని నిలువరించి.. పరిస్థితి అదుపుచేసే యత్నం చేస్తున్నారు.
ఇదీ చదవండి: తమిళనాడు డీజీపీ ఆఫీస్‌కు ‘బాంబు’ బెదిరింపు
Comments
Please login to add a commentAdd a comment