బెంగళూరు కర్ణాటకలో ఉందా .. పాకిస్థాన్‌లో ఉందా? | Bengaluru Woman Complaint Swiggy Delivery Boy | Sakshi
Sakshi News home page

బెంగళూరు కర్ణాటకలో ఉందా .. పాకిస్థాన్‌లో ఉందా?

Published Sun, Sep 15 2024 10:57 AM | Last Updated on Sun, Sep 15 2024 11:10 AM

Bengaluru Woman Complaint Swiggy Delivery Boy

బెంగళూరు కర్ణాటకలో ఉందా .. పాకిస్థాన్‌లో ఉందా? అని ప్రశ్నిస్తూ ఓ మహిళ చేసిన ట్వీట్‌ చర్చకు దారి తీసింది.

బెంగళూరు కేంద్రంగా నివసిస్తున్న ఓ మహిళ తాను ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టానని, డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్‌కి కన్నడ రాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

‘బెంగళూరు కర్ణాటకలో ఉందా లేదా పాకిస్థాన్‌లో ఉందా? అని ప్రశ్నిస్తూ మీ డెలివరీ ఉద్యోగికి కన్నడ,ఇంగ్లీష్ కూడా మాట్లాడలేకపోతున్నారు. కనీసం అర్థం చేసుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. హింది మేం కూడా నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారా? భాషని మాపై రుద్దడం ఆపండి. మీ డెలివరీ పార్ట్‌నర్‌లు కన్నడ నేర్చుకునేలా చూడండి’ అని సదరు మహిళ ట్వీట్​ చేశారు.

అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వినియోగ దారుడు భారత్‌లో ప్రతి 50 కిలోమీటర్లకు భాష మారుతుంది. కానీ భాష విషయంలో తమిళ, కన్నడిగులు అంత కఠినంగా ఉండరు. అలా ఉండకూడదు. భారతదేశం వైవిధ్యం, అనేక భాషలతో కూడిన దేశం, అన్ని భాషలను గౌరవించాలి.

మరొకరు మీరు డెలివరీ చేసే వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి? అని ఓ నెటిజన్‌ ప్రశ్నిస్తుంటే.. డెలివరీ సకాలంలో జరిగినంత కాలం డెలివరీ బాయ్ భాషా నైపుణ్యాల గురించి ఎవరు పట్టించుకుంటారు? అని మరోకరు అండగా నిలుస్తున్నారు. మీరు నిజంగా డెలివరీ చేసే వ్యక్తితో ఎందుకు మాట్లాడాలి? మీ ఆహారాన్ని తీసుకోండి. రేటింగ్ ఇవ్వండి అది చాలు’ అని ట్వీట్‌ చేశారు. 

ఇదీ చదవండి :  ప్రధానిగా నాకు అవకాశం వచ్చింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement