
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో క్యాబినెట్‌లో ఎవరెవరికి చోటుదక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు క్యాబినెట్ కూర్పుతో పాటు కీలక పదవుల్లో ఎవరిని తీసుకోవాలనే దానిపై కసరత్తు కొలిక్కివచ్చినట్టు తెలిసింది. ధార్వాడ్ నుంచి నాలుగుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి, గతంలో కర్నాటక బీజేపీ చీఫ్‌గా పనిచేసిన ప్రహ్లాద్ జోషీని లోక్‌సభ స్పీకర్‌గా ఎంపిక చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్ధానాలు దక్కిన నేపథ్యంలో దక్షిణాదిలో పాగావేయాలన్న బీజేపీ వ్యూహంలో భాగంగా జోషీ పేరు తెరపైకి వచ్చిందని సమాచారం. పలువురు బీజేపీ, మిత్రపక్షాల ఎంపీలకు పార్టీ చీఫ్ అమిత్ షా నుంచి పిలుపు రావడంతో వారికి క్యాబినెట్ బెర్త్‌లు ఖరారయ్యాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment