హైదరాబాద్: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తన రూపే క్రిడెట్ కార్డులను యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) పరిధిలోకి తీసుకొచ్చింది. బ్యాంక్ కస్టమర్లందరూ తమ యాక్టివ్ రూపే క్రెడిట్ కార్డ్‌ను యూపీఐకి అనుసంధానం చేసుకోవచ్చు.
ఖాతా ఆధారిత యూపీఐ లావాదేవీల తరహాలోనే కార్డ్‌ని భౌతికంగా వినియోగించకుండానే చెల్లింపులు జరపవచ్చు. పీఓఎస్ మెషీన్‌లు లేని వ్యాపారులు యూపీఐతో అనుసంధానమైన రూపే క్రెడిట్ కార్డు కలిగి ఉన్న కస్టమర్ల నుంచి చెల్లింపులు పొందవచ్చు. దీనివల్ల చిన్న వ్యాపారులు తక్కువ ఖర్చుతో విక్రయాల టర్నోవర్‌ను, వ్యాపారాన్ని పెంచుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment