Rail safety
-
రైల్వే భద్రతకు ‘కోరాస్’
న్యూఢిల్లీ: రైళ్ల భద్రత కోసం ఇకపై కమాండోలు రంగంలోకి దిగనున్నారు. కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ (కోరాస్) యూనిట్‌ను రైల్వే మంత్రి గోయల్ బుధవారం ప్రారంభించారు. కోరాస్ కమెండోలకు అంతర్జాతీయ శిక్షణ ఇవ్వాల్సిందిగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)కు సూచించినట్లు తెలిపారు. కోరాస్ యూనిట్‌ను మొదట ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో మోహరించనున్నట్లు వెల్లడించారు. కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కమాండోలు భవిష్యత్‌లో సేవలు అందించనున్నట్లు తెలిపారు. రైల్వేలకు నష్టం, అంతరాయం, రైళ్లపై దాడి, హైజాక్, విపత్తులకు సంబంధించిన ఏ పరిస్థితుల్లో అయినా కమాండోలు సేవలు అందిస్తారని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ తెలిపారు. -
రైల్వే భద్రతకోసం ప్రత్యేక ఫండ్..!
న్యూఢిల్లీ: రైల్వేలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి 2016-17 బడ్జెట్లో రైల్వేలకు ప్రత్యేక ప్రతిపాదనలు చేయనున్నారట. ముఖ్యంగా వరుస ప్రమాదాలతో కునారిల్లుతున్నభారతీయ రైల్వే వ్యవస్థను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు బాగా పెరిగిపోవడంతో ప్రయాణీకుల భద్రతకు భరోసా ఇచ్చేందు కు ప్రత్యేక నిధులతో రడీ అవుతోంది. రైలు భద్రత ప్రత్యేక ఫండ్ కోసం రూ .20,000 కోట్ల ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైల్వే బడ్జెట్ కోసం రెండు పేజీలను ప్రత్యేకంగా కేటాయించినట్టు తెలిపారు. సాధారణ బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రధాన ప్రాజెక్టులు, వ్యయ మరియు ఆదాయ లక్ష్యాలు సహా రైల్వే 'రాబోయే కార్యకలాపాలు గురించి ప్రస్తావన ఉంటుంది. రాబోయే బడ్జెట్ 2017-18 లో ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై రైలు మార్గాల్లో ట్రాక్‌లు మరియు వంతెనల బలోపేతానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ప్రత్యేక భద్రతా నిధి కోసం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. బడ్జెట్లో రూ.20వేల కోట్లు కేటాయించనున్నారు. కొత్త రైళ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలపై పెద్దగా ప్రతిపాదనలు ఉండకపోవచ్చు కానీ, ప్రయాణికుల భద్రత ఫండ్ కు సంబంధించిన కీలకమైన ప్రకటన వెలువడే అవకాశంఉందని సీనియర్ రైలు మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. రైలు నెట్వర్క్ అభివృద్ధిలో ఇది ఒక నమూనా మార్పుగా ఆయన అభివర్ణించారు. ఫెన్సింగ్ ల వద్ద మనుషులు, పశువుల చొరబాటును నిరోధించడంపై బడ్జెట్ పేపర్లలో ప్రముఖ ప్రస్తావన ఉండనున్నట్టు చెప్పారు. ప్రధాన రహదారు మార్గం వెంట మానవరహిత లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపుతో పాటు , ఫెన్సింగ్, ట్రాక్ మరియు సిగ్నలింగ్ అభివృద్ధి , రెండు కారిడార్లు కోసం రూ 21,000 కోట్ల అంచనా వ్యయంతో నిధులను కేటాయించనున్నారు. . రైల్వే ట్రాక్‌లు, వంతెనల బలోపేతం, మరమ్మతుల కోసం పెద్దఎత్తున నిధులు కేటాయించనున్నారు. రూ. 34 వేల కోట్ల మూలధనంతో రైల్వే హోల్డింగ్ కంపెనీని ఏర్పాటుచేసే ప్రతిపాదన తీసుకురానున్నట్టు తెలిపారు. దీని ప్రకారం ఐఆర్సీటీసీ, ఆర్ఐటీఈఎస్, కొంకర్, రైల్‌టెల్, ఎమ్ఆర్వీసీ సహా మొత్తం 14 ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ కంపెనీ ఏర్పాటు కానుంది. రైల్వేల వేగాన్ని నియంత్రించకుండా, ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్ వ్యవస్థలను ఏర్పాటుచేయాలనేది ప్లాన్. తొలుత 160 కిలోమీటర్లకు, అనంతరం 200 కిలోమీటర్లకు పెంచే యోచన ఉన్నట్టు కూడా చెప్పారు. దీనికోసం కిలోమీటర్‌కు రూ.45 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కాగా గత రెండు నెల్లో అయిదు ఘోర రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా దాదాపు 200 మంది రైలు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వందలమంది గాయపడ్డారు. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్టో విలీనం చేసిన యూనియన్ బడ్జెట్ ను మొదటిసారి ఫిబ్రవరి 1 ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టనున్నసంగతి తెలిసిందే. -
ప్రయాణికుల భద్రత గాలికి!
ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోని రైల్వే వేధిస్తున్న సిబ్బంది కొరత ఏళ్ల తరబడి భర్తీ చేయని ఖాళీలు సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తరచూ పేర్కొంటున్న రైల్వే శాఖ పొదుపు పేరుతో ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతోంది. కొత్త రైల్వే లైన్లు నిర్మితమవుతున్నాయి, రైళ్ల సంఖ్య పెరుగుతోంది, అన్నింటికి మించి వాటి వేగాన్ని పెంచుతున్నారు. ఇలాంటి సమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంతోపాటు కీలక విభాగాల్లో సిబ్బంది సంఖ్యా పెంచాల్సి ఉంది. కానీ రైల్వే శాఖ దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. గతేడాది నవంబరులో కాన్పూరు సమీపంలో చోటుచేసుకున్న భారీ ప్రమాదం కళ్లముందు కదలాడుతుండగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో మరో భారీ దుర్ఘటన సంభవించింది. వాతావరణమే పెద్ద శత్రువు... చలికాలం, ఎండాకాలం, వానకాలం... రైళ్లకు పెద్ద శత్రువులు. చిన్న నిర్లక్ష్యం భారీ ప్రమాదాలకు తద్వారా తీవ్ర ప్రాణనష్టానికి కారణమవుతోంది. వానాకాలంలో మెరుపు వరదలతో ట్రాక్ దిగువ మట్టి కొట్టుకుపోయి రైళ్లు ప్రమాదాలకు గురవుతుంటాయి. తీవ్ర ఎండ, అతి చలి తీవ్రతతో ఉత్పన్నమయ్యే ప్రమాదాలను నివారించాలంటే ఆధునిక పరిజ్ఞానం తప్పనిసరి. ఇక్కడే మన రైల్వే శాఖ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి పట్టా విరగటమే కారణమన్న ప్రాథమిక అంచనాకొచ్చారు. ఆ పట్టా ఎలా విరగిందన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. వెంట్రుకవాసి పగులు చాలు చలి తీవ్రంగా ఉన్నప్పుడు రైలు పట్టాలు సంకోచిస్తాయి. ఆ సమయంలో అంతర్గతంగా విపరీతమైన ఒత్తిడి పెరిగి ఉన్నట్టుండి పట్టాలు విరిగిపోతాయి. ఏమాత్రం బలహీనంగా ఉన్నా, పటుత్వం తగ్గినా, వెంట్రుకవాసి పగుళ్లున్నా పట్టాలు విరిగిపోతాయి. పట్టా తయారీలో లోపం, పాతపడటం, అరిగిపోవటం తదితర కారణాలతో చిన్నచిన్న పగుళ్లు ఏర్పడుతుంటాయి. చలికాలంలో పట్టాలు సంకోచించిన సమయంలో ఆ ప్రాంతంలో విరుగుతాయి. పగుళ్లను గుర్తించాలంటే అల్ట్రా సానిక్ పరీక్ష అవసరం. విదేశాల్లో అల్ట్రాసానిక్ పరికరాలతో కూడిన మినీ రైల్వే కార్లను వినియోగిస్తున్నారు. మనవద్ద అవి వేళ్లమీద లెక్కపెట్టేన్ని మాత్రమే ఉన్నాయి. పట్టాల కింద కంకర చెదిరినప్పుడు కుషన్ వ్యవస్థ దెబ్బతిని కూడా పట్టాలో క్రాక్స్ ఏర్పడతాయి. సకాలంలో టాంపింగ్ మెషీన్ ద్వారా దాన్ని సరిచేయకుంటే ప్రమాదం పొంచిఉన్నట్టే. కానీ, ఆ యంత్రాల కొరత తీవ్రంగా ఉంది. ట్రాక్‌మెన్ ఖాళీలు 20 వేలు పదేళ్ల క్రితం భారతీయ రైల్వే ఉద్యోగుల సంఖ్య 20 లక్షలు... ప్రస్తుతం 13 లక్షలు.. పదవీ విరమణ, ఇతర కారణాలతో సిబ్బంది తగ్గిపోతుంటే... జీతాల ఖర్చూ తగ్గుతోందని సంతోషిస్తున్న రైల్వే శాఖ కొత్త నియామకాలను చేపట్టడం లేదు. గతంలో ఏటా రిక్రూట్మెంట్ కొనసాగగా ఇప్పుడు రెండేళ్లకోమారు చొప్పున నిర్వహిస్తోంది. రైళ్ల భద్రతకు ఆయువుపట్టుగా భావించే ట్రాక్‌మెన్(గ్యాంగ్‌మెన్)ల కొరత తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా 20 వేల ఖాళీలున్నాయి. దీంతో ఉన్నవారిపై భారం పెరుగుతోంది.