
మహిళా శక్తి... మాటలకేనా?
ఈ ఫేస్‌బుక్, వాట్సాప్ యుగంలో మెజారిటీ జనం సూక్తులు చెప్పేవారే!!. సమాజ వికాసం ఆడపిల్లలతోను, మహిళలతోనే మొదలవుతుందని జైట్లీ కూడా చెప్పారు. మరి వారికోసం ఏం చేశారు? 14 లక్షల ఐసీడీఎస్ అంగన్‌వాడీలలో మహిళా శక్తి కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామంటూ దానికి రూ.500 కోట్లిచ్చారు. ఒకో కేంద్రానికి రూ.4వేలకన్నా తక్కువే. దీంతో మహిళల సాధికారత, స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, డిజిటల్ అక్షరాస్యత, ఆరోగ్యం, పౌష్ఠికాహారం అన్నీ సాధ్యమవుతాయట!! గర్భిణీ స్త్రీలకు రూ.6 వేలిచ్చే పథకానికి అధికారిక ట్యాగ్ వేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో 48 శాతంగా ఉన్న మహిళల భాగస్వామ్యం ఇపుడు 55కు చేరిందట. దీన్ని పురోగతిగా అనొచ్చా?
దేశంలో మహిళలు : 58.6 కోట్లు
(2011జనాభా లెక్కల ప్రకారం)