![Baby Girl To ICDS - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/24/papa.jpg.webp?itok=B1dknjbW)
13 రోజుల శిశువు
ఇబ్రహీంపట్నం : ఆడబిడ్డను సాకలేమని 13 రోజుల శిశువును తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. మంచాల మండలం వెంకటేశ్వర తండాకు చెందిన ఆ శిశువు తల్లిదండ్రులకు (పేర్లు వెల్లడించేందుకు నిరాకరణ) అంతకు ముందు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. మూడో కాన్పుల్లో అడ, మగ కవల పిల్లలకు ఆ తల్లి జన్మనిచ్చింది. కవలల్లో మగ పిల్లాడిని ఉంచుకొని, ఆడపిల్లను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.
నలుగురిని సాకే ఆర్థిక స్థోమత తమకు లేదని తల్లిదండ్రులు తెలిపారు. ఆడ శిశువును ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి శాంతిశ్రీకి అప్పగించారు. ఆ శిశువును నగరంలోని శిశువిహార్‌కు తరలించినట్లు శాంతిశ్రీ తెలిపారు. తమ వివరాలు వెల్లడించవద్దని ఆ కుటుంబసభ్యులు తెలిపినట్లు ఆమె చెప్పారు. 1
Comments
Please login to add a commentAdd a comment