
నాన్నది ఫ్రెండ్లీ బడ్జెట్: సోనాలి జైట్లీ
న్యూఢిల్లీ: దశాబ్దాల సంప్రదాయానికి విరుద్ధంగా నెల రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్న స్పందనలు వెలువడుతున్నాయి. అధికార బీజేపీ సభ్యులు సహజంగానే ‘ఆహా.. ఓహో.. ’అంటుండగా, విపక్షాలు మాత్రం ‘ఇందులో ఏమీ లేదు’అని పెదవి విరుస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూతురి స్పందనపై ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ ప్రకటన ముగిన తర్వాత పార్లమెంట్ బయటకు వచ్చిన సోనాలీ జైట్లీ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు.
‘ఇది చాలా మంచి బడ్జెట్. నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేశారు. ఆడపడుచుల కోసం ఎన్నెన్నో పథకాలు ప్రకటించారు. ఇది మహిళా అనుకూల బడ్జెట్ కూడా’ అని సోనాలి అన్నారు. బడ్జెట్ ప్రకటన సందర్భంగా బుధవారం పార్లమెంట్‌కు వచ్చిన జైట్లీ కుటుంబసభ్యులు విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని బడ్జెట్ ను ఆసక్తిగా విన్నారు.